DHANURMASA RITUALS AT TTD SUB TEMPLE_ టిటిడి అనుబంధ ఆలయాల్లో డిసెంబరు 17 నుంచి ధనుర్మాస కైంకర్యాలు

Tirupati, 8 December 2017: TTD plans to conduct special rituals at some of the sub temples from December 17 to to January 14 of 2018.

The events will be held at the Sri Prasanna Venkateswaraswamy temple, Appalayagunta, Sri Kalyana Venkateswara Swamy temple, Srinivasa Mangapuram in Tirupati and the Sri Venkateswara Swamy temple with Padmavathi at Pithapuram in East Godavari Dist. The rituals include Tiruppavai parayanam in place of Suprapatham and special rituals on Vaikunta Ekadasi and Dwadasi.

The artists from HDPP and Annamacharya Project will perform bhakti sangeet, Harikatha parayanam at all the local sub temples of TTD during the Dhanur Masam rituals.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

టిటిడి అనుబంధ ఆలయాల్లో డిసెంబరు 17 నుంచి ధనుర్మాస కైంకర్యాలు

తిరుపతి, 2017 డిసెంబరు 08: టిటిడి అనుబంధ ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 17వ తేదీ నుండి 2018, జనవరి 14వ తేదీ వరకు విశేష కార్యక్రమాలు జరుగనున్నాయి. డిసెంబరు 16వ తేదీ ఉదయం 11.13 గంటలకు ధనుర్మాసం ప్రారంభం కానుంది.

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 17వ తేదీ నుండి ధనుర్మాస కైంకర్యాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 29న వైకుంఠ ఏకాదశి, 2018, జనవరి 1వ తేదీ నూతన ఆంగ్ల సంవత్సరాది, సంక్రాంతి సందర్భంగా జనవరి 15న విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో ప్రతిరోజూ తెల్లవారుజామున తిరుప్పావై పారాయణం చేస్తారు. వైకుంఠ ద్వాదశి అయిన డిసెంబరు 30న ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు స్నపనతిరుమంజనం, ఉదయం 10.15 గంటలకు శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల వీధి ఉత్సవం నిర్వహిస్తారు.

శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 17వ తేదీ నుండి ధనుర్మాస కైంకర్యాలు ప్రారంభం కానున్నాయి.

ఇందులో భాగంగా ప్రతిరోజూ తెల్లవారుజామున 3.00 నుంచి 4.00 గంటల వరకు సుప్రభాతం స్థానంలో తిరుపల్లి ఎళుచ్చి (తిరుప్పావై) పారాయణం చేస్తారు. వీటితోపాటు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, ఆంగ్ల నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలతోపాటు స్వామి, అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ధనుర్మాస కైంకర్యాలు ప్రారంభం కానున్నాయి.

ఇందులో భాగంగా వైకుంఠ ఏకాదశి, నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో ప్రతిరోజూ తెల్లవారుజామున ద్రావిడ ప్రబంధం(తిరుప్పావై) పారాయణం చేస్తారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో హరికథా పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.