COMPLETE ALL DEVELOPMENT WORKS SPEEDILY: TTD EO SRI ANIL KUMAR SINGHAL_ తిరుమలలో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirumala, 8 December 2017: TTD EO Sri Anil Kumar Singhal directed officials to complete all works in and around Tirumala on war footing.

During an inspection of the works of along with Tirumala JEO Sri KS Sreenivasa Raju, he urged officials to speed up works in the 272 room VakulaMata Rest House was being built at a cost of Rs 39 crore on the Papavinasanam Road.

Similarly the works on the Srivari Seva Sadan should be ready for occupation by March 2018 with facilities for training of Srivari Sevaks and also bhajan halls.

Both also inspected the works underway at the outer ring road, Kalyana Vedika and also the Slot Sarva Darshan counters.

Among others TTD Chief Engineer Sri Chandrasekhar Reddy, SE-2 Sri Ramachandra Reddy, VGO Sri Raveendra Reddy and other officials were present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

తిరుమలలో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

డిసెంబరు 08, తిరుమల, 2017: తిరుమలలోని పలు ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుమలలో శుక్రవారం తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుతో కలిసి ఈవో తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో మరింత మంది భక్తులకు బస కల్పించేందుకు రూ.39 కోట్ల వ్యయంతో 272 గదులు ఉండేలా పాపవినాశనం మార్గంలో నూతనంగా వకుళామాత విశ్రాంతి భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. శ్రీవారిసేవా సదన్‌ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, మార్చి నెల నాటికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇందులో శ్రీవారి సేవకులకు బస, శిక్షణ, భజనలు చేసేందుకు పెద్ద హాళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా అర్చక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎస్‌సి, ఎస్‌టి, మత్స్యకార కాలనీలలో టిటిడి నిర్మిస్తున్న నూతన ఆలయాలకు సంబంధించి ఆయా ఆలయ కమిటీలు ఎంపిక చేసిన వారికి తిరుపతిలోని శ్వేత భవనంలో అర్చక శిక్షణ ఇస్తామని వివరించారు. ఇందులో ఆలయ శుద్ధి, పూజ విధానం, నైవేద్యం సమర్పణ తదితర అంశాలపై శిక్షణ ఇస్తామని తెలియజేశారు.

అంతకుముందు ఈవో, తిరుమల జెఈవో కలిసి పాపవినాశనం మార్గంలో నూతనంగా నిర్మిస్తున్న వకుళామాత విశ్రాంతి భవనాన్ని, శ్రీవారిసేవా సదన్‌ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు పనులు, కల్యాణవేదిక వద్ద జరుగుతున్న అబివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం సర్వదర్శనం కౌంటర్లను తనిఖీ చేశారు.

వీరివెంట టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, విజివో శ్రీ రవీంద్రారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.