DHANURMASAM TO COMMENCE ON DECEMBER 16 AT 6.12PM _ డిసెంబరు 17 నుండి జనవరి 14వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై

TIRUPPAVAI TO REPLACE SUPRABHATAM IN TIRUMALA TEMPLE FROM DECEMBER 17 TO JAN 14

 

PASURA PARAYANAM IN THE 900-YEAR-OLD PEDDA JEEYAR MUTT TO BE TELECASTED LIVE ON SVBC

 

Tirumala, 14 December 2022: As the auspicious month of Dhanurmasam is commencing from at 6.12pm from December 16 onwards, Andal Sri Godai Tiruppavai will be recited in the place of Suprabhatam-the awakening seva of Lord inside Tirumala temple from December 17 till January 14, 2023.

 

All the Sri Vaishnavaite temples follow the recitation of Tiruppavai hymns during the entire Dhanurmasa and also considered as an important month for all spiritual seekers, as it is believed as the most sacred period to worship of Lord Sri Maha Vishnu.

 

According to Hindu scriptures, a day of God is equal to six months (Uttarayana) and a night equal to the remaining months (Dakshinayana) in a human year. 

 

Dhanurmasam falls at the end of Dakshinayana. In fact, this month is considered to be auspicious for worship during early hours and this hour is called “Brahma Muhurtam”. 

 

In Kaliyuga, Sri Venkateswara is considered as an incarnation of Sri Maha Vishnu. To invoke the blessings of the Srivaru, Tiruppavai Pasurams penned by one of the important among 12 Alwars, Andal Sri Godai will be recited, with each one on each day for a total thirty days seeking the prosperity of humanity – devoid of disease, natural calamities or any form of unhappiness.

 

TIRUPPAVAI PASURA PARAYANAM IN PEDDA JEEYAR MUTT FROM DECEMBER 17

 

In connection with the auspicious Dhanurmasam, each day there will be a recitation of each Pasuram in Sri Pedda Jeeyar Mutt at Tirumala between 7am and 8am starting from December 17 till January 14 next.

 

This religious event takes place in the presence of HH Sri Sri Sri Periyakovil Kelviyappan Sri Shatagopa Ramanuja Periya Jeeyar Swamy of Tirumala which will be also graced by HH Sri Tirumala Chinna Jeeyar Swamy. This spiritual programme will be live telecasted by SVBC every day between 7am and 8am for the sake of global devotees. 

 

It may be mentioned here that the Pedda Jeeyar Mutt was established by the great Sri Vaishnava Saint Sri Ramanujacharya about 900 years ago in Tirumala. 

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

డిసెంబరు 17 నుండి జనవరి 14వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై

తిరుమ‌ల‌, 2022 డిసెంబరు 14: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబ‌రు 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆనాటి సాయంత్రం 6.12 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా ధనుర్మాస ఘడియలు 2023 జనవరి 14న ముగియనున్నాయి.

ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం…

పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

ఆండాళ్‌ తిరుప్పావై పారాయణం…

12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్‌(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్‌ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.

డిసెంబరు 17 నుండి జనవరి 14వ తేదీ వరకు శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్ స్వామి మ‌ఠంలో తిరుప్పాపై పారాయ‌ణం

పవిత్ర ధనుర్మాసం సంద‌ర్బంగా డిసెంబ‌రు 17 నుండి 2023 జ‌న‌వ‌రి 14వ తేదీ వ‌ర‌కు శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్ స్వామి మ‌ఠంలో తిరుప్పావై పారాయ‌ణం చేయ‌నున్నారు.

కాగా విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్ర‌తిపాదించిన భ‌గ‌వ‌ద్ రామానుజాచార్యులు 900 సంవత్సరాల క్రితం తిరుమ‌ల‌లో పెద్ద‌జీయర్ మఠం ఏర్పాటు చేశారు.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం ఎదురుగా ఉన్న శ్రీ‌శ్రీ‌శ్రీ పెరియకోయిల్‌ కేల్వి అప్పన్‌ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్‌స్వామి సమక్షంలో శ్రీ పెద్ద జీయ్యంగారు మ‌ఠంలో నెల రోజుల పాటు ఉద‌యం 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు తిరుప్పావై పాశురాల‌ను పారాయ‌ణం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా వెలసి ఉన్న శ్రీవారి భక్తుల కోసం ఎస్వీబీసీ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.