TWO SRINIVASA KALYANAMS IN DECEMBER _ కర్ణాటక రాష్ట్రం రామనగరలో డిసెంబరు 16న ప్రొద్దుటూరు లో డిసెంబరు 18న శ్రీనివాస కల్యాణాలు

RAMNAGAR IN KARNATAKA ON DEC 16 & PRODATTUR IN AP ON DEC 18

 

Tirupati, 14 December 2022: As part of the propagation of Sanatana Hindu Dharma  TTD is organising Srinivasa Kalyanams at Ramnagar in Karnataka on December 16 and Prodattur in AP on December 18.

 

Former CM of Karnatak Sri HD Kumaraswamy is sponsoring the Ramnagar fete which is being held in the district stadium where TTD officials have put up a grand platform and made elaborate arrangements for Electrical and floral decorations.

 

The artists of HDPP and Annamacharya projects will present cultural programs including Sankeetans and bhajans.

 

TTD Engineering officials in coordination with local officials are making arrangements for barricades, VIPs entry and exit gates, seating arrangements for common devotees etc. The entire event will be live telecast by the SVBC channel.

 

AT PRODDATUR ON DEC 18

 

TTD is organising the celestial Srinivasa Kalyanam fete on December 18 at the Municipal High School Grounds in coordination with the Govinda Mala team of the district town.

 

All arrangements are being made under the directives by TTD officials which include platform, electrical and floral decorations, barricades, parking, drinking water etc. 

 

The holy event will be held at the premises between 6pm and 8pm.

 
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
 

కర్ణాటక రాష్ట్రం రామనగరలో డిసెంబరు 16న ప్రొద్దుటూరు లో డిసెంబరు 18న శ్రీనివాస కల్యాణాలు

తిరుపతి 14 డిసెంబరు 2022: కర్ణాటక రాష్ట్రం రామనగర లోని డిస్ట్రిక్ట్ స్టేడియంలో డిసెంబరు 16వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీనివాసకల్యాణం నిర్వహించనున్నారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి శ్రీ కుమార స్వామి సౌజన్యంతో టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నారు.

వేలాదిమంది భక్తులు పాల్గొనేలా రామనగర డిస్ట్రిక్ట్ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు. టీటీడీ అధికారుల పర్యవేక్షణలో కళ్యాణ వేదిక నిర్మాణం, విద్యుత్ అలంకరణల పనులు జరుగుతున్నాయి. స్వామివారి కల్యాణం సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు.

టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు స్థానిక అధికారులసమన్వయంతో అవసరమైన పనులు చేపట్టారు. బ్యారికేడ్లు, విఐపిల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, భక్తులు కూర్చునేందుకు చేయాల్సిన పనులు ప్రారంభించారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్
ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

18న ప్రొద్దుటూరులో…

వై ఎస్ ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని మున్సిపల్ హైస్కూలు మైదానంలో డిసెంబరు 18వ తేదీ శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన గోవిందమాల భక్త బృందం టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించింది. టీటీడీ అధికారుల సూచనల మేరకు వేదిక, విద్యుత్, బ్యారికేడ్ల నిర్మాణం పనులకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశారు. 18వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వేలాదిమంది భక్త బృందం సమక్షంలో కన్నుల పండువగా కల్యాణం నిర్వహించనున్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల ఆధికారిచే జారీ చేయడమైనది