APPLICATIONS INVITED FOR TIRUPPAVAI DISCOURSES_ తిరుప్పావై ఉపన్యాసాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

Tirupati, 24 September 2018: Applications from Sri Vaishnava pundits have been invited to render Tiruppavai discourses during the upcoming Dhanurmasam from December 16 till January 14, 2019.

Interested candidates can forward the applications on or before October 15 before 5pm addressing to Special Officer, Alwar Divya Prabandha Project, SVETA Building, Tirupati.

For more details, contact, Ph:0877 226447/4083

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తిరుప్పావై ఉపన్యాసాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి, 2018 సెప్టెంబరు 24: పవిత్రమైన ధనుర్మాసంలో 2018 డిసెంబరు 16 నుంచి 2019 జనవరి 14వ తేదీ వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుప్పావై ఉపన్యాసాలు చేసేందుకు సమర్థులైన శ్రీవైష్ణవ సిద్ధాంతం తెలిసిన పండితుల నుంచి దరఖాస్తులు, అంగీకార పత్రాలను టిటిడి ఆహ్వానిస్తోంది.

టిటిడి ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతి ఏటా ధనుర్మాసంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుప్పావై ఉపన్యాసాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అర్హులైనవారు ఈ ఏడాది అక్టోబరు 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ”ప్రత్యేకాధికారి, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు, శ్వేత భవనం, టిటిడి, తిరుపతి” అనే చిరునామాకు దరఖాస్తులు, అంగీకార పత్రాలు పంపాల్సి ఉంటుంది. అంగీకార పత్రాలు ఇచ్చే పండితుల పట్టికతోపాటు, షరతులు, దరఖాస్తులను www.tirumala.org మరియు www.tirupati.org వెబ్‌సైట్ల నుంచి పొందొచ్చు.

ఇతర వివరాలకు టిటిడి ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్టు కార్యాలయాన్ని 0877-2264447, 0877-2264083, సెల్‌ : 9908577715 నంబర్ల ద్వారా సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.