PAVITRA SAMARPANA HELD_ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా పవిత్ర సమర్పణ

Tiruchanoor, 24 September 2018: As a part of the ongoing three day annual Pavitrotsavams at Sri Padmavathi Ammavari temple in Tiruchanoor, Pavitra Samarpana was held on Monday.

After the special abhishekam, snapana tirumanjanam, in Sri Krishna Mukha Mandapam, Pavitra Malalu were decorated to the processional deity of Goddess and other deities in the main shrine and in sub-shrines.

Special Grade DyEO Sri Munirathnam Reddy and other officers were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా పవిత్ర సమర్పణ

తిరుపతి, 2018 సెప్టెంబరు 24: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం వైభవంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఇందులో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఆలయం నుండి యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ హోమాల అనంతరం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ, తీర్థప్రసాద గోష్ఠి చేపట్టారు. ఈ కారణంగా కల్యాణోత్సవం, సహస్రదీపాలంకారసేవ, అష్టదళపాదపద్మారాధన సేవలు రద్దయ్యాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి ప్రత్యేకశ్రేణి డెప్యూటి ఈఓ శ్రీ మునిరత్నంరెడ్డి, ఎఇఓ శ్రీసుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీమతి మల్లీశ్వరి, టెంపుల్‌ ఇన్స్‌పెక్టర్‌ శ్రీ గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

సెప్టెంబరు 25న చక్రస్నానం :

పవిత్రోత్సవాల్లో చివరి రోజైన సెప్టెంబరు 25వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు స్నపనతిరుమంజనం, చక్రస్నానం జరుగనుంది. ఉదయం మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జనం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రీకృష్ణస్వామివారు, శ్రీ సుందరరాజ స్వామివారు, శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వచ్చి భక్తులకు దర్శనమిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.