DHARMA RAKSHANA YAGAM for 21 Days Begins in Vedic University Campus _ ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో ధర్మపరిరక్షణ యాగం ప్రారంభం
ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో ధర్మపరిరక్షణ యాగం ప్రారంభం
తిరుపతి, 2010 ఆగష్టు 12: కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతీస్వామి వారి నిర్వహణలో గురువారం ఉదయం స్థానిక వేద విశ్వవిద్యాలయం యాగశాలలో ధర్మపరిరక్షణ యాగం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా శ్రీ సిద్దేశ్వరానంద భారతీస్వామి భక్తులనుద్దేశించి మాట్లాడుతూ సమాజంలో అవ్యవస్థపెరిగి పొయిందనీ, దానినుండి సమాజాన్ని కాపాడడానికి ఈ యాగం చేస్తున్నామని, మనుష్యులలో అథార్మిక భావాలను తొలగించడానికి దేశవ్యాప్తంగా ఇటువంటి యాగాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ దేశాన్ని, సమస్త మానవులను కాపాడేందుకు చేస్తున్న ఈ యాగంలో కుల,మత వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు పాల్గొనవచ్చునని స్వామిజీ తెలిపారు. ఈ యాగంలో మంత్ర ప్రేరితములైన దేవతలు తప్పక మనల్ని అనుగ్రహిస్తారని స్వామిజీ అన్నారు. ఈ యాగం సెప్టెంబరు 2వ తేది వరకు జరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా మౌనప్రభ అను మాసపత్రికను, వేంకటేశ సహస్రనామస్థోత్రం సిడిలను తితిదే జెఇఓ డాక్టర్ యువరాజ్ విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో తితిదే ముఖ్య భద్రతాధికారి శ్రీ ఎం.కె.సింగ్, డిపిపి కార్యదర్శి డాక్టర్ రాళ్ళబండి కవితా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.