DHARMIC AND BHAKTI SANGEET ALLURE DEVOTEES _ శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో ఆక‌ట్టుకున్న ధార్మిక‌, భక్తి సంగీత కార్య‌క్ర‌మాలు

TIRUMALA, 21 OCTOBER 2023: The series of Dharmic and Bhakti Sangeet arranged by TTD on various platforms at Tirumala and in Tirupati , in connection with the ongoing Navaratri Brahmotsavams impressed the devotees on Saturday.

In Asthana Mandapam, Smt Vanisree team rendered Vishnu Sahasra Nama Parayanam, Smt Hema Sri team rendered devotional bhajans, Smt Madhavi Krishna team presented Annamacharya Sankeertans while Smt Siva Parvati rendered Harikatha Parayanam.

At Nada Neerajanam, the performance of the newly tuned Annamacharya Sankeertans by renowned music director Sri Saluri Vasu Rao and his disciples, renowned young singer Sri Rani Srinivasa Sharma with his team allured devotees. For the first time the newly tuned Annamacharya Sankeertans which have not seen the public domain so far have been rendered by the artistes in a befitting manner.

In Tirupati, the performances by various artists at Mahati, Ramachandra Pushkarini and Annamacharya Kalamandiram impressed the locals.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో ఆక‌ట్టుకున్న ధార్మిక‌, భ క్తి సంగీత కార్య‌క్ర‌మాలు

 తిరుమల, 2023 అక్టోబరు 21 ; శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏడ‌వ రోజైన శ‌నివారం తిరుమ‌ల‌, తిరుప‌తిలోని ప‌లు వేదిక‌ల‌పై టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ధార్మిక, భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు ఆక‌ట్టుకున్నాయి.

తిరుమ‌ల‌ ఆస్థాన మండ‌పంలో శ‌నివారం ఉదయం 10 నుండి 11 గంటల వరకు వాణిశ్రీ‌ బృందంచే విష్ణుసహస్రనామ పారాయ‌ణం, ఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంటల వరకు హేమ‌శ్రీ‌ బృందం భ‌క్తి సంగీతం నిర్వ‌హించారు. మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు శ్రీ నాగార్జునాచార్య‌ భ‌క్తామృతం ధార్మికోప‌న్యాసం చేశారు. సాయంత్రం 4 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌మ‌తి మాధ‌విక్రిష్ణ‌ బృందం అన్నమాచార్య సంకీర్తనలను మృదుమధురంగా గానం చేశారు. సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.00 గంటల వరకు శ్రీ‌మ‌తి శివ‌పార్వ‌తి బృందం హ‌రిక‌థ గానం చేశారు.

తిరుప‌తిలోని మహతి ఆడిటోరియంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు ప‌ద్మ‌శ్రీ డా.ఎల్లా వెంక‌టేశ్వ‌ర‌రావు మ‌రియు శ్రీ ప్ర‌భాక‌ర్ బృందం భ‌క్తి సంగీతం, అన్న‌మాచార్య క‌ళామందిరంలో శ్రీ శ‌బ‌రిగిరీష్ మ‌రియు శ్రీ‌మ‌తి ప్ర‌భావ‌తి బృదం భ‌క్తి సంగీతం, శ్రీ రామచంద్ర పుష్కరిణి వేదికపై శ్రీ శ్రీ‌నివాస‌రావు బృదం భ‌క్తి సంగీతం అల‌రించాయి.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది