DHARMIKA CONCLAVE HELD LIKE NEVER BEFORE- EO _ శ్రీవారి ఆశీస్సులతో ధార్మిక సదస్సు విజయవంతం• టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి
Tirumala, 04 February 2024: TTD EO Sri AV Dharma Reddy thanked all the Pontiffs and Hindu religious heads who gave TTD their valuable suggestions to take forward Hindu Dharmic programs with more enthusiasm in future in a big way.
During his concluding remarks on the second day of Dharmika Sadas held at Astana Mandapam in Tirumala on Sunday, he said, the Religious Conclave was held in a most successful manner like never before.
He said the TTD Chairman Bhumana Karunakara Reddy will present these resolutions taking the suggestions givens by Seers of various mutts who participated in person as well virtually. He presented the two day Dharmic Sadas highlights
Yesterday 24 and today 17 Pontiffs have graced in person and given their valuable suggestions in the conference while 16 seers gave their suggestions and advice virtually.
57 Pontiffs accepted our invitation and participated in person or virtually and made the Dharmika Sadas a cent percent success. I once again humbly thank all the great seers for their valuable suggestions and support to TTD and for guiding us to move ahead in Sanatana Hindu Dharma Pracharam with more spirit and energy.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
శ్రీవారి ఆశీస్సులతో ధార్మిక సదస్సు విజయవంతం
• 57 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు విచ్చేశారు
• టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి
ఫిబ్రవరి 04, తిరుమల, 2024: తిరుమల ఆస్థాన మండపంలో జరుగుతున్న ధార్మిక సదస్సుకు 57 మంది స్వామీజీలను ఆహ్వానించగా అందరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుగ్రహభాషణం అందించారని, ఈ విధంగా సదస్సు విజయవంతమైందని టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి తెలిపారు.
సదస్సు రెండో రోజు ఆదివారం సాయంత్రం ఈవో మాట్లాడుతూ నభూతో నభవిష్యతి అన్నట్టుగా ధార్మిక సదస్సు జరిగిందన్నారు. ధార్మిక సదస్సుకు స్వామి వారి ఆశీస్సులు చక్కగా ఉన్నాయనడంలో సందేహాలు లేదన్నారు. సదస్సులో శనివారం 24 మంది మహనీయులు, ఆదివారం 17 మంది మహనీయలు ప్రత్యక్షంగా, 16 మంది వర్చువల్ గా తమ సూచనలు, సలహాలు ఇచ్చారని వివరించారు. మఠాధిపతులు, పీఠాధిపతులు తమ కీలక సలహాలు, సూచనలిచ్చి టీటీడీకి దిశా నిర్దేశం చేశారని చెప్పారు. మహనీయుల ఉపన్యాసాలను రికార్డ్ చేశామని, వీటిని తీర్మానాలుగా చేసి రేపటి రోజున మఠాధిపతులు, పీఠాధిపతులు సమక్షంలో మీడియా ప్రతినిధుల ముందు టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి ప్రవేశపెడతారని తెలిపారు. వచ్చే బోర్డు సమావేశంలో వీటిని ఆమోదించి టీటీడీ తదుపరి కార్యాచరణ చేపడుతుందని వెల్లడించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.