DHWAJA AVAROHANAM PERFORMED _ ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

Tiruchanoor, 19 November 2020: The annual Karthika Brahmotsavams of Sri Padmavati Ammavau at Tiruchanoor concluded with Dwajavarohanam event on Thursday.

Temple archakas lowered the sacred flag on the Dwaja stambham between 8.00-9.00 pm amidst chanting of Veda mantra and mangala vadyams.

With this event, the Navahnika Brahmotsavams came to a successful end.

Tirupati JEO Sri P Basanth Kumar, Temple DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, Temple Staff and others were present.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల, 2020 నవంబర్ 19: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.

రాత్రి 8 నుండి 9.30 గంటల మధ్య ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను గజ పటాన్ని అవనతం చేసి దేవతలను వారి వారి స్థానాలకు సాగనంపుతారు.

అంతకుముందు రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఆలయంలో  ఊరేగించారు. 

ఈ కార్యక్రమంలో ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్‌ దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝూన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, కంకణభట్టార్ శ్రీ వేంపల్లి శ్రీనివాసులు, సూప‌రింటెండెంట్ శ్రీ కుమార్, ఏవిఎస్వో శ్రీ చిరంజీవి, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.