DHWAJAROHANAM HELD WITH RELIGIOUS FERVOUR _ ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

GARUDA DHWAJAPATHAM HOISTED ON TEMPLE MAST IN VRISHABHA LAGANAM

VONTIMITTA, 10 APRIL 2022: The annual Sri Ramanavami Navahnika Brahmotsavam off to a grand religious start with Dhwajarohanam on Sunday at Vontimitta Sri Kodanda Ramalayam in YSR Kadapa district.

GARUDA PRATISTA

The archakas under the supervision of Kankanabhattar Sri Rajesh Kumar performed a series of rituals which included Garuda Avahana, Garuda Pratista, Garuda Stotram recitation, Garuda flag hoisting etc. as per the norms of Pancharatra Agama.

GARUDA PATHAM PROCESSION

Earlier Garuda Patham was taken on a procession amidst Vedic mantras and Tala Vaidyams around the includes 

TALA RAGA NIVEDANAM

Inviting all the three crore deities to the nine day mega festival the Archakas recited mantras while the blessings of Asta Dikpalakas have been invoked by playing Tala Vaidyas viz.Dhruva Talam, Suruti Ragam, Adi, Nadanamakriya, Atha Talam, Bhringini Talam, Lalita Ragam, Champaka Talam, Bhairavi Ragam, Eka Talam, Malaya Marutam, Triputa Talam, Begada, Rupaka Talam, Vasanta Bhairavi, Gandharva Talam, Kinkara Ragam, Nandi Talam, Sankarabharanam, Garuda Talam, Ananda Vardhana Ragam in befitting manner.

HOISTING DHWAJAPATHAM

The Garuda Dhwajapatam was hoisted in the auspicious Vrishabha Lagnam between 8am and 9am.

VASTRAMS PRESENTED 

The local legislator Sri Meda Mallikarjuna Reddy has offered Pattu Vastrams to Sri Kodanda Rama Swamy on the auspicious occasion of Sri Rama Navami. ZP Chief Sri Amarnath Reddy was also present.

GRAND START OF ANNUAL BTUs-JEO

The annual Brahmotsavama commenced in a celestial manner in the auspicious muhurat with Dhwajarohanam said, TTD JEO Sri Veerabrahmam.

The important days includes Garuda Seva on April 14, Sri Sita Rama Kalyanam on April 15, April 18 Chakra Snanam and Pushpa Yagam on April 19. He said TTD has made elaborate arrangements for the mega festival. The devotees shall have darshan of the presiding deities and vahana sevas in a pleasant manner. Distribution of water and buttermilk has also been arranged for the sake of devotees and Srivari Sevaks are pressed into service, he added.

DyEO Sri Ramana Prasad was also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
 
 ఒంటిమిట్ట, 2022 ఏప్రిల్ 10: టిటిడికి అనుబంధంగా ఉన్న ఒంటిమిట్టలోని పురాతన చారిత్రకప్రాశస్త్యం గల శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 నుండి 9 గంటల వరకు వృషభలగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వ‌హించారు. ధ్వజస్తంభానికి నవకలశపంచామృతాభిషేకం చేసి ఇంద్రాది సకలదేవతలను, నవగ్రహాలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేద పారాయణం చేశారు. అదేవిధంగా, మధ్యతాళం – నాదనామక్రియా రాగం, భృంగిణి తాళం – లలిత రాగం, చంపక తాళం – భైరవి రాగం, ఏకతాళం – మలయమారుత రాగం, త్రిపుట తాళం – మేఘరంజని రాగం, రూపక తాళం – వసంతభైరవి రాగం, గంధర్వ తాళం – కింకర రాగం, నంది తాళం – శంకరాభరణం రాగం, గరుడ తాళం – ఆనందవర్ధన రాగం ఆలపించారు. కంకణబట్టర్‌ శ్రీ కెహెచ్.రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది.
 
ఈ సందర్భంగా జెఈఓ శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ ధ్వజారోహణంతో వైభవంగా రాములవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టు తెలిపారు. ఈ ఉత్సవాల్లో ప్రధానంగా ఏప్రిల్ 13న హనుమంత వాహనం, ఏప్రిల్ 14న గరుడ సేవ, ఏప్రిల్ 15న కల్యాణోత్సవం, ఏప్రిల్ 16న రథోత్సవం, ఏప్రిల్ 18న చక్రస్నానం జరుగుతాయన్నారు.
 
పట్టువస్త్రాల సమర్పణ
 
బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ మేడా మల్లికార్జునరెడ్డి శ్రీ సీతారామలక్ష్మణులకు పట్టువస్త్రాలు సమర్పించారు.
 
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీ అమరనాథరెడ్డి, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఎమ్మెల్యే శ్రీ మేడా మల్లికార్జునరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈఓ డా. రమణప్రసాద్, శ్వేత సంచాలకులు శ్రీమతి ప్రశాంతి, ఏఈఓ శ్రీ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ శ్రీ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఆర్.ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.