DHWAJASTHAMBHA KAVACHA PRATISTA IN KEELAPATLA_ ఏప్రిల్‌ 18 నుంచి 22వ తేదీ వరకు కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ కవచ ప్రతిష్ఠ

Tirupati, 16 April 2018: The Dhwajsthambha Kavacha Pratista ceremony in the famous ancient temple at Keelapatla will be observed from April 18-22 with Ankurarpanam on April 17.

On April 22 the Pratista Mahotsavam will be performed between 7:30am and 9am in Virshabhalagnam.
DyEO Sri Venkataiah is supervising the arrangements.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

ఏప్రిల్‌ 18 నుంచి 22వ తేదీ వరకు కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ కవచ ప్రతిష్ఠ

ఏప్రిల్‌ 16, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 18 నుంచి 22వ తేదీ వరకు ధ్వజస్తంభ కవచ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరుగనుంది. ఏప్రిల్‌ 17న ఈ కార్యక్రమానికి అంకురార్పణ నిర్వహిస్తారు.

ఏప్రిల్‌ 18న ఉదయం అకల్మష హోమం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాసనం, సాయంత్రం కుంభం బింబం యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్ఠ హోమం నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 19న ఉదయం వాస్తు శాంతి, నిత్యహోమం సాయంత్రం పంచకవరాదివాసం, ఏప్రిల్‌ 20న ఉదయం క్షీరాధివాసం హోమాలు, సాయంత్రం జలాధివాస హోమాలు చేపడతారు. ఏప్రిల్‌ 21న ఉదయం మహాశాంతి హోమం, సాయంత్రం మహాశాంతి తిరుమంజనం, పూర్ణాహుతి నిర్వహిస్తారు.

ఏప్రిల్‌ 22న ఆదివారం ఉదయం 7.30 నుంచి 9 గంటల నడుమ వృషభ లగ్నంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం చేపడతారు. ఈ సందర్భంగా మహాపూర్ణాహుతి, కుంభం బింబం ఆలయ ప్రవేశం నిర్వహిస్తారు. ఈ ఉత్సవ ఏర్పాట్లను శ్రీనివాసమంగాపురం ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య పర్యవేక్షిస్తున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.