PROBE INTO FAKE WEBSITES-TTD EO_ టిటిడి పేరుతో గల బోగస్‌ వెబ్‌సైట్లపై విచారణ చేపట్టాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌

Tirupati, 16 April 2018: TTD EO Sri Anil Kumar Singhal has instructed CV and SO Sri Ake Ravikrishna to take up detailed investigation on fake websites running on the name of TTD and cheating pilgrims.

During Senior Officers meeting held at Conference Hall in Tirupati on Monday, the EO said, as the coming 15 weeks are going to witness heavy summer rush in Tirumala, elaborate arrangements should be made under the supervision of senior officers. He directed the TTD PRO Dr T Ravi to ensure the programmes telecasted on the TV screens are qualitative by taking the feedback from the pilgrims waiting in compartments.

The EO instructed the concerned to ensure that there is no jostling among the pilgrims whenever compartments are released for darshan and fix noiseless fans while the pilgrims entering the temple complex for darshan. Directed the Electrical wing officials, the EO instructed them to maintain a separate register to for all electrical gadgets in different departments of TTD.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి పేరుతో గల బోగస్‌ వెబ్‌సైట్లపై విచారణ చేపట్టాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌

ఏప్రిల్‌ 16, తిరుపతి, 2018: శ్రీవారి దర్శనం, బస ఇతర సేవల బుకింగ్‌కు సంబంధించి టిటిడి పేరుతో కొన్ని బోగస్‌ వెబ్‌సైట్లు పనిచేస్తున్నాయని, వీటిపై సమగ్రంగా విచారణ చేపట్టి భక్తులు మోసపోకుండా చర్యలు చేపట్టాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణను కోరారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోగల సమావేశ మందిరంలో సోమవారం సీనియర్‌ అధికారులతో ఈవో సమావేశం నిర్వహించారు.

వేసవి దృష్ట్యా రాబోయే 15 వారాలు తిరుమలలో అధికరద్దీ ఉంటుందని, అందుకు తగ్గట్లు సీనియర్‌ అధికారుల పర్యవేక్షణలో ఏర్పాట్లు చేపట్టాలని ఈవో ఆదేశించారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో టీవీల ద్వారా ప్రసారం చేస్తున్న కార్యక్రమాల నాణ్యత, విషయపరిజ్ఞానంపై భక్తుల అభిప్రాయాలు సేకరించాలని ప్రజాసంబంధాల అధికారికి సూచించారు. కంపార్ట్‌మెంట్ల నుంచి భక్తులను దర్శనానికి వదిలే సమయంలో ఒకరినొకరు తోసుకోకుండా తగిన చర్యలు చేపట్టాలని భద్రతా అధికారులను ఆదేశించారు. శ్రీవారి ఆలయంలోకి వెళ్లే భక్తుల సౌలభ్యం మేరకు శబ్దం రాని ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని ఎలక్ట్రికల్‌ అధికారులను కోరారు. శ్రీవారి పుష్కరిణి వద్ద అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.

తిరుమలలో భక్తుల రద్దీకి తగ్గట్లు మరుగుదొడ్ల సంఖ్యను పెంచనున్న క్రమంలో వాటి డిజైన్లు చక్కగా రూపొందించాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఈవో ఆదేశించారు. కన్యాకుమారి, కురుక్షేత్రలో శ్రీవారి ఆలయాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. టిటిడిలోని అన్ని విభాగాలలో విద్యుత్‌ పరికరాలకు సంబంధించి ప్రత్యేకంగా రిజిస్టర్‌లు నిర్వహించాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ, ఎఫ్‌ఏసిఏవో శ్రీ ఓ.బాలాజీ, చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.