DHWAJAVAROHANAM MARKS CONCLUSION _ ధ్వజావరోహణంతో ముగిసిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు 

VONTIMITTA, 08 APRIL 2023: The annual nine-day brahmotsavam which commenced at Vontimitta Sri Kodandarama temple in YSR Kadapa district on March 31, concluded on a grand religious note with Dhwajarohanam on Saturday evening.

 

Deputy EO Sri Natesh Babu, Temple Inspector Sri Dhananjeyulu and others were present.

 

Annual Pushpayagam will be observed on April 9 between 6pm and 8:30pm on Sunday.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ధ్వజావరోహణంతో ముగిసిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట 2023 ఏప్రిల్ 08: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ధ్వజావరోహణంతో ఘనంగా ముగిశాయి.

రాత్రి 7 గంటల నుండి అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు.

బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.