‌DHYAN MANDIR INAUGURATED IN NEW DELHI _ న్యూఢిల్లీలో ధ్యానమందిరాన్ని ప్రారంభించిన తితిదే ఛైర్మన్‌

NEWDELHI, MAY 30:  The TTD Trust Board Chairman Sri Kanumuru Bapiraju has inaugurated Dhyan Mandir-Meditation hall in the premises of Sri Venkateswara Swamy temple in New Delhi on Thursday.

Speaking in the auditorium hall on this occasion, the Chairman said, TTD besides taking care of pilgrims amenities including accommodation, darshan and prasadam, also launched various socio-religious programmes and has been successfully carryingout them from the past several decades. “The Lord Venkateswara temples at Kanyakumari, Kurukshetra and Mumbai are also in the offing which will be completed soon and enable more and more number of pilgrims to have the blessings of Universal Lord,” he maintained.

The new temple at New Delhi is a boon to all the devotees as people from all faiths, places and languages visit the city being the Nation’s capital and also visit the temple. He later complimented donor Sri Nirmal Sethia and his family members for his largesse and felicitated them with the prasadams of Lord.

Later TTD EO Sri LV Subramanyam said, TTD has conceptualised various noble and novel programmes with an aim to incorporate dharmic values and ethics among the youth of today Briefing on Subhapradham, Sadacharam, Managudi, Srinivasa Kalyanams, Prahladam etc. the EO said, “All these programmes are designed to inculcate the values embedded in Hindu Sanatana Dharma to our children and make them good citizens of the country”, he maintained. He said dharmic programmes will be conducted every day in the newly inaugurated Dhyan Mandir also.

TTD’s Astana Sangeetha Vidhwan Dr G Balakrishna Prasada rendered various kritis of saint poet Annamacharya and enthralled the denizens. The Spiritual discourses by famous scholar Sri Mallapragada Satyanarayana mused the audience.

TTD Board members Smt K Kamala, Sri L Sivaprasad, SE III Sri Ramachandra Reddy and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

న్యూఢిల్లీలో ధ్యానమందిరాన్ని ప్రారంభించిన తితిదే ఛైర్మన్‌

తిరుపతి, మే 30, 2013: న్యూఢిల్లీలోని కాలిబాడి ప్రాంతంలో నిర్మించిన ధ్యానమందిరాన్ని తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు గురువారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా ధ్యానమందిరంలోని ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన సభలో శ్రీ బాపిరాజు ప్రసంగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తుల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోందని, తిరుమలకు విచ్చేసే భక్తులు స్వామివారిని కనులారా దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. కురుక్షేత్ర, ముంబయి, కన్యాకుమారి తదితర ప్రాంతాల్లో ఆలయ నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వీలు కల్పిస్తామన్నారు. ముఖ్యంగా ఢిల్లీలో నిర్మించిన ఈ ఆలయం దేశ రాజధానిలోని భక్తులకు, సుదూర ప్రాంతాల నుండి నగరానికి వచ్చే యాత్రికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని, తద్వారా వారికి స్వామివారి దర్శనానికి వీలు కల్పిస్తున్నామని తెలిపారు.
అనంతరం శ్రీ బాపిరాజు ఆలయ దాత శ్రీ నిర్మల్‌ సేథియను, ఆయన కుటుంబ సభ్యులను, ఆలయం, ధ్యానమందిరం నిర్మాణానికి విశేషంగా కృషి చేసిన అందరినీ శ్రీవారి చిత్రపటం, ప్రసాదాలు, స్వామివారి శాలువతో ఘనంగా సత్కరించారు.
తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం మాట్లాడుతూ సనాతన ధర్మ వ్యాప్తి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అనేక కార్యక్రమాలను భక్తుల ముందుకు తీసుకెళుతోందన్నారు. శుభప్రదం, సదాచారం, మనగుడి, శ్రీనివాస కల్యాణాలు లాంటి నూతన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సమాజంలో సనాతన ధర్మ విలువలను వ్యాప్తి చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. న్యూఢిల్లీలో ఏర్పాటుచేసిన ధ్యానమందిరంలో ఆధ్యాత్మిక గ్రంథాలయంతో పాటు ఇకపై నిరంతరంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి ధ్యానమందిరం, ఆలయ నిర్మాణానికి సంబంధించిన విశేషాలను విచ్చేసిన భక్తులకు వివరించారు.
ఆలయ దాత శ్రీ నిర్మల్‌ సేథియ మాట్లాడుతూ న్యూఢిల్లీలో శ్రీవారి ఆలయం నిర్మించి భక్తులకు దర్శనం కల్పించాలన్న 16 ఏళ్ల కల నేటికి నెరవేరిందన్నారు. అందుకు శ్రీవారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా ఆడిటోరియంలో తితిదే ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌ నిర్వహించిన ఆధ్యాత్మిక సంగీత విభావరి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం కన్నుల పండువగా నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి అవతారతత్త్వంపై ప్రవచన కార్యక్రమం జరిగింది. కాగా ధ్యానమందిరం మొత్తం 64,770 చదరపుటడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో తితిదే సమాచార కేంద్రం, ఆధ్యాత్మిక గ్రంథాలయం, క్యాంటీన్‌, సంగీత, నృత్య శిక్షణ కోసం గదులు, మెడిటేషన్‌ హాల్‌ ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో తితిదే పాలకమండలి సభ్యులు శ్రీమతి కాండ్రు కమల, శ్రీ శివప్రసాద్‌, ఎస్‌ఈలు శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ వేంకటేశ్వర్లు, ఏఈవో శ్రీ ఆనందరాజు, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.