DIAL YOUR EO _ – డయల్ యువర్ ఈవోలో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

TIRUMALA, 02 MARCH 2024: Before taking the calls from the pilgrim callers during the monthly Dial your EO programme held at Annamaiah Bhavan in Tirumala on Saturday, the TTD EO Sri AV Dharma Reddy briefed the devotees about the programmes that were held in the last one month and also the upcoming events.

He said Radhasapthami was observed in a grand manner where lakhs witnessed Saptha Vahana Sevas and appreciated the Annaprasadam, milk, water distribution, shelter facilities provided by TTD.

For the ensuing summer, initiatives are underway to ensure all convenience to devotees visiting Tirumala during the summer holidays. From April to July to tackle additional devotee rush, TTD has decided to reduce VIP break, Srivani, tourism quota, virtual Sevas enabling common devotees.

TTD has taken steps to issue 85% of 7500 rooms available at Tirumala ( adequate for 45,000 persons) to common devotees only. Devotees are also advised to stay at Tirupati as more accommodation could not be provided in Tirumala.

On the lines of Tirumala and Tiruchanoor, TTD has launched Nitya Annaprasadam services from February 29 onwards at Sri Govindaraja Swamy temple in Tirupati.

Sri Padmavati Children’s Heart Centre set a record of 12 heart transplants and 2485 heart operations in the last two years. From March 1 onwards cashless medical services have been launched in SVIMS for fever, vomitings, cold, cough etc. also besides super specialities like Gynaecology, paediatrics, obstetric, ophthalmology, ENT, general medicine and general surgery for Arogyasri Card holders.

Annual Teppotsavam in Tirumala will be observed from March 20 to 24 while other important religious events includes Mahashivartri at Gogarbha Theertham on March 8 and Thumburu Theertha Mukkoti fete on March 25.

TTD is performing special programs like Amalaka Ekadasi on March 20, Lakshmi Jayanti on 25 and Sheetalastami on April 2 at the SV Vedic University 

 

Important festivals in TTD run temples

Sri Kalyana Venkateswara temple, Srinivasa Mangapuram annual Brahmotsavams between February 29 to March 8

Sri Kapileswara Swamy brahmotsavams from March 1 to 10 in Tirupati

At Sri Venkateswara temple, Jubilee Hills, brahmotsavams in Hyderabad from March 8 to 16 

Brahmotsavams at Sri Venkateswara temple Tondamanpuram from March 9 to 17 

Annual Brahmotsavam at Tarigonda Sri Lakshmi Narasimha temple from March 16 to 24.

After the programme, speaking to the media the TTD EO has given the Darshan and other pilgrim statistics related to the month of February.

Darshan:19.06 lakhs

Hundi collection: ₹111.71 crore

Laddu sales: 95.43 lakhs

Anna Danam: 43.61 lakhs 

Kalyana Katta : 6.56 lakhs

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీ‌వారి భ‌క్తుల కోసం వేసవిలో విస్తృత ఏర్పాట్లు

– శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ

– డయల్ యువర్ ఈవోలో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుమ‌ల‌, 2024 మార్చి 02: వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామ‌ని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఈవో ముందుగా భ‌క్తుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

రథసప్తమి :

– ఫిబ్రవరి 16న తిరుమలలో నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఉదయం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి తరించారు.

– లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు, టి, కాఫీ, పాలు, అల్పాహారాలు అందించాం.

తిరుమలలో వేసవి ఏర్పాట్లు :

– వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టాం.

– ఏప్రిల్‌ నుండి జూలై వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ విఐపి బ్రేక్‌, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్‌ సేవలు, రూ.300 దర్శన టికెట్లు తగ్గించాం.

– తిరుమలలో దాదాపు 7500 గదులు ఉన్నాయి. వీటిలో 45 వేల మందికి సరిపడా వసతి అందుబాటులో ఉంది. దాదాపు 85 శాతం గదులు సామాన్య భక్తుల కోసమే కేటాయిస్తున్నాం.

– వేసవిలో తిరుమలకు తరలివచ్చే వేలాది మంది భక్తులకు అవసరమైనంత వసతి సౌకర్యం లేనందున భక్తులు తిరుపతిలో వసతి పొందాల్సిందిగా కోరడమైనది.

శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ

– తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద ఉన్న పాత మ్యూజియంలో ఫిబ్రవరి 29వ తేదీ నుండి భక్తులకు నిత్యాన్నదానాన్ని ప్రారంభించాం.

శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం :

– శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం(చిన్నపిల్లల గుండె ఆసుపత్రి) ప్రారంభమైన రెండేళ్ల కాలంలోనే 12 గుండె మార్పిడి ఆపరేషన్లు, 2485 గుండె ఆపరేషన్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యబృందాన్ని అభినందిస్తున్నాను.

శ్రీ పద్మావతి జనరల్‌ ఆసుపత్రి :

– స్విమ్స్‌కు అనుబంధంగా ఉన్న శ్రీ పద్మావతి జనరల్‌ ఆసుపత్రిలో మార్చి 1వ తేదీ నుండి గైనకాలజీ, ఒబెస్ట్రిక్స్‌, పీడియాట్రిక్స్‌, ఆప్తమాలజీ, ఇఎన్‌టి, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ విభాగాలలో నగదు రహిత వైద్యసేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

తిరుమలలో ఉత్సవాలు :

– మార్చి 20 నుండి 24వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

– మార్చి 8న గోగర్భ తీర్థంలో క్షేత్రపాలకుడికి మహాశివరాత్రి పర్వదినం.

– మార్చి 25న తుంబురుతీర్థ ముక్కోటి.

ఫాల్గుణ మాస కార్యక్రమాలు :

– ఎస్వీ వేదవిశ్వవిద్యాలయంలో మార్చి 20న అమలక ఏకాదశి, మార్చి 25న లక్ష్మీ జయంతి, ఏప్రిల్‌ 2న శీతలాష్టమి పూజ నిర్వహిస్తాం. వీటిని ఎస్వీబీసీలో ప్రసారం చేస్తాం.

టీటీడీ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు :

– మార్చి 8వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో.

– మార్చి 1 నుండి 10వ తేదీ వరకు – తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో.

– మార్చి 8 నుండి 16వ తేదీ వరకు – హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో.

– మార్చి 9 నుండి 17వ తేదీ వరకు – తొండమాన్‌పురంలోని శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో.

– మార్చి 16 నుండి 24వ తేదీ వరకు – తరిగొండలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో.

ఫిబ్రవరి నెలలో నమోదైన వివరాలు :

దర్శనం :

– శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య – 19.06 లక్షలు.

హుండీ :

– హుండీ కానుకలు – రూ.111.71 కోట్లు.

లడ్డూలు :

– విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య – 95.43 లక్షలు.

అన్నప్రసాదం :

– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య – 43.61 లక్షలు.

కల్యాణకట్ట :

– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య – 6.56 లక్షలు.

ఈ కార్య‌క్ర‌మంలో జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, సిఈ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, సిపిఆర్వో డా.టి.ర‌వి. ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.