DEVOTEES POUR IN APPRECIATION ON TTD PROGRAMS _ యువకులైన శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించేందుకు ముందుకు రావాలి

DIAL YOUR EO HELD AT TIRUMALA

TIRUMALA, 02 MARCH 2024: The monthly Dial your EO programme which was held at Annamaiah Bhavan in Tirumala on Saturday witnessed the callers pouring in appreciation for several pilgrim initiatives taken up by TTD as well the dharmic and SVBC programmes.

A total of 28 callers including a caller in Muscat have given feedback to the TTD EO Sri AV Dharma Reddy in this one hour live phone-in programme. Callers Sri Sudhakar from Guntakal, Smt Munilakshmi and Sri Mithilesh from Nellore, Sri Dhananjayan from Chennai appreciated the TTD Board, EO and his team for the reforms taken up in recent times for the benefit of devotees.

However, Sri Tarun Kumar from Coimbatore, Smt Krishna Kumari from Hyderabad brought to the notice of EO the poor facilities at Panchajanyam and Sapthagiri rest houses respectively. Reacting to these callers, the EO said the Sapthagiri is over four to five decades old and repairs are not possible. So in the recent board meeting, it was decided to construct a new one in its place and the issue will be resolved in a few months”, he maintained.

 

When Sri Venkatesh from Hyderabad sought EO that the buses from Tirupati to Tirmala and vice-versa be operated by TTD at nominal rates, to which EO answered it is not possible for TTD for the maintenance and manpower.  

Another caller Sri Venkateswara Rao from Hyderabad asked EO to consider increasing the upper age limit in Srivari Seva to 65years from 60 to which the EO answered him as Srivari Seva involves offering services to fellow devotees, the upper age limit cannot be revised.

JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao and others were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

యువకులైన శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించేందుకు ముందుకు రావాలి

– ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ ద‌ర్శ‌నం, సేవా టికెట్లు పొందిన భ‌క్తుల‌కు వ‌స‌తి

– శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాల ధ‌ర‌లు త‌గ్గించ‌లేం

– డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుమ‌ల‌, 2024 మార్చి 02: యువకులైన శ్రీవారి సేవకులు క్యూ లైన్లు, శ్రీవారి ఆలయంలో భక్తులకు సేవలందించేందుకు ముందుకు రావాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా టీటీడీ చేపట్టిన అనేక కార్యక్రమాలతో పాటు ధార్మిక మరియు ఎస్వీబిసి కార్యక్రమాలు బాగున్నాయ‌ని భ‌క్తులు ప్రశంసల వర్షం కురిపించారు.

తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం శ‌నివారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

1. వెంక‌టేశ్వ‌ర రావు – హైద‌రాబాద్

ప్రశ్న : శ్రీ‌వారి సేవ‌కుల వ‌య‌స్సు 60 సంవ‌త్స‌రాల పుండి 65 సంవ‌త్స‌రాలు చేయండి.

ఈవో : ప్ర‌తి రోజు వేలాది మంది భ‌క్తులు తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌స్తుంటారు, వారికి ఎలాంటి అసౌక‌ర్యం క‌లుగ‌కుండా సేవ‌లందించ‌డానికి 60 సంవ‌త్స‌రాలలోపు వారైతే బాగా సేవ‌లందిస్తారు.

2. రామ‌ల‌క్ష్మీ – నంద్యాల‌

ప్రశ్న : శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాలు రెండే ఇస్తున్నారు. ప్ర‌తి భ‌క్తుడికి 10 ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకొండి,

ఈవో : శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న ప్ర‌తి భ‌క్తుడికి ఒక ఉచిత ల‌డ్డూ అందిస్తున్నాం. బ్ర‌హ్మోత్సవాలు, వైకుంఠ‌ ఏకాద‌శి త‌దిత‌ర ప‌ర్వ‌దినాల్లో త‌ప్ప‌, మిగిలిన స‌మ‌యంలో భ‌క్తులు కావాల‌సిన‌న్ని ల‌డ్డూలు పొంద‌వ‌చ్చు.

3. వెంక‌టేష్ – హైద‌రాబాద్‌

ప్రశ్న: శ్రీ‌వారి ల‌డ్డూ ప‌రిమాణం త‌గ్గింది. రేటు త‌గ్గించండి.

ఈవో : ల‌డ్డూ బ‌రువు, ప‌రిమాణం త‌గ్గ‌లేదు, రేటు త‌గ్గించ‌డానికి అవ‌కాశం లేదు.

4. నాగేశ్వ‌ర‌రావు – హైద‌రాబాద్‌

ప్రశ్న : మా స్నేహితులు ఇటీవ‌ల అమెరికా నుండి శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చారు. ద‌ర్శ‌నానంత‌నం తిరుమ‌ల‌లోని టీటీడీ బుక్ స్టాల్‌లో రూ. 111/- విలువ గ‌ల ఒక‌ గోవింద నామాల పుస్త‌కాన్ని అడిగితే, అక్క‌డ సిబ్బంది బ‌ల‌వంతంగా ఒక్కొక్క‌టి రూ.150/- వంతున రెండు పుస్త‌కాలు ఇచ్చారు.

ఈవో : దీనిపై ప‌రిశీలించి విధులలో ఉన్న సిబ్బందిపై చ‌ర్య లు తీసుకుంటాం.

4. ధ‌నంజ‌య – చెన్నై

ప్రశ్న : ఫిబ్ర‌వ‌రి 24న తిరుప‌తి జ‌న్మ‌దిన వేడుక‌లు చాలా అద్భుతంగా నిర్వ‌హించారు. టీటీడీలోని అన్ని కార్య‌ల‌యాల్లో శ్రీ భ‌గ‌వ‌త్ రామానుజ‌చార్యులు ఫోటో పెట్టండి.

ఈవో : ప్ర‌స్తుతం శ్రీ‌వారు, శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఫోటోలు మాత్ర‌మే ఉంటాయి. మీ స‌ల‌హాన్ని ఆగ‌మ స‌ల‌హా మండ‌లికి విన్న‌విస్తాం.

5. తిరుమ‌ల రెడ్డి – తిరుప‌తి

ప్రశ్న : 2009లో అష్ట‌ద‌ళ పాద‌ప‌ద్మారాధ‌న సేవా టికెట్లు కొనుగోలు చేశాం. కానీ కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల సేవ‌కు రాలేకపోయాం. తిరిగి టికెట్లు కేటాయించండి.

ఈవో : అష్ట‌ద‌ళ పాద‌ప‌ద్మారాధ‌న టికెట్లు ప‌రిమిత సంఖ్య‌లో ఉంటాయి. ప‌రిశీలిస్తాం.

6. సుధాక‌ర్ – గుంత‌క‌ల్లు ర‌వీంద్ర – హైద‌రాబాద్‌

ప్ర‌శ్న : శ్రీ‌వారిని ద‌గ్గ‌ర‌గా చూసే అవ‌కాశం క‌ల్పించండి.

ఈవో : విఐపి సిఫార‌స్సు లేట‌ర్లు, శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా టికెట్లు కొనుగోలు చేసి బ్రేక్ ద‌ర్శ‌నం పొంద‌వ‌చ్చు.

7. తుల‌సీ – బెంగుళూరు

ప్ర‌శ్న : ఆన్‌లైన్‌లో అంగ‌ప్ర‌ద‌క్ష‌ణ టోకెన్లు, ఆర్జిత సేవ‌లు, రూ.300/- టికెట్లు సెంక‌డ్ల‌లో అయిపోతున్నాయి. ఎన్ని సార్లు ప్ర‌య‌త్నించిన పొంద‌లేక పోతున్నాం.

ఈవో: శ్రీ‌వారిపై ఉన్న‌ అచంచ‌ల భ‌క్తి వ‌ల్ల టికెట్లు త్వ‌ర‌గా అయిపోతున్నాయి. అప్ప‌టికి మేము టికెట్ల బుకింగ్‌ను క్లౌడ్‌లో ఉంచుతున్నాం. మా వ్య‌వ‌స్థ‌ చాలా పార‌ద‌ర్శ‌కంగా, ప‌టిష్టంగా, అద్బుతంగా ప‌నిచేస్తోంది.

8. నాగేంద్ర – గుంటూరు

ప్ర‌శ్న : సేవా, ద‌ర్శ‌నం టికెట్లతో పాటు వ‌స‌తి బుక్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించండి.

ఈవో : ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ద‌ర్శ‌నం, సేవా టికెట్లు పొందిన భ‌క్తుల‌కు వ‌స‌తి అందుబాటులోకి వ‌స్తుంది.

9. వెంక‌టేష్ – వ‌రంగ‌ల్‌

ప్ర‌శ్న : గ‌తంలో శ్రీ‌వారి సేవ‌కుల‌కు చివ‌రి రోజు సుప‌థం గుండా ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్నారు. దానిని పున‌రుద్ద‌రించండి.

ఈవో : ఇదివ‌ర‌కు సుప‌థం ఉండేది, ప్ర‌స్తుతం రూ.300/- క్యూ లైన్‌లోనే శ్రీ‌వారి సేవ‌కుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్నాం.

10. నిఖిలేష్ – నెల్లూరు

ప్ర‌శ్న : ఎస్వీబిసిలో కార్య‌క్ర‌మాలు చాలా బాగున్నాయి. అదేవిధంగా నాద‌నీరాజ‌నం వేదిక‌పై విద్యార్థుల‌కు పురాణాల‌పై పోటీలు నిర్వ‌హిస్తే యువ‌త‌లో భ‌క్తి భావం పెరుగుతుంది.

ఈవో : విద్యార్థుల‌కు భ‌గ‌వ‌ద్గీత పోటీలు, ఎస్వీబిసిలో అన్న‌మ‌య్య‌, వెంగ‌మాంబ సంకీర్త‌న‌ల‌పై పోటీలు నిర్వ‌హించి శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్నాం. విద్యార్ధుల‌కు అందించేందుకు భ‌గ‌వ‌ద్గీత‌ను ఐదు బాష‌ల‌లో 15 పేజిల‌తో కోటి పుస్త‌కాల‌ను ముద్రిస్తున్నాం.

11. కృష్ణకుమారి – హైద‌రాబాద్ తరుణ్‌కుమార్ – కోయంబత్తూరు మునిల‌క్ష్మీ – నెల్లూరు

ప్ర‌శ్న : సప్తగిరి విశ్రాంతి గృహాలు, ఎఎన్‌సి, జిఎన్‌సి వ‌స‌తి గ‌దుల‌లో గీజ‌ర్లు ప‌ని చేయ‌డంలేదు. పాంచజన్యంలో బొద్దింక‌లు ఎక్కువ‌గా ఉన్నాయి. వసతులు సరిగా లేవు.

ఈవో : గ‌తంలో 50 సంవ‌త్స‌రాల క్రితం నిర్మించిన సప్తగిరి విశ్రాంతి గృహాల‌ను ఆధునీక‌రిస్తాం. కొత్త గీజ‌ర్లు పెట్టిన అన్ని వ‌స‌తి గ‌దుల‌లో వెంట‌నే క‌నెక్ష‌న్ ఇవ్వ‌వ‌ల‌సిందిగా అధికారుల‌ను ఆదేశించాం. పాంచ‌జ‌న్యంలో బొద్దింక‌ల నివార‌ణ‌కు వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటాం.

12. శ్రీ వెంకటేష్ – హైదరాబాద్‌

ప్ర‌శ్న: తిరుపతి నుంచి తిరుమ‌లకు బస్సులను నామమాత్రపు ధరలకు టీటీడీ నడ‌పాలి.

ఈవో: టీటీడీకి సాధ్యం కాదు.

13. అప్ప‌న్న – విశాఖ‌ప‌ట్నం

ప్ర‌శ్న : భ‌క్తులు తిరుమ‌ల‌కు ప్లాస్టిక్ వాట‌ర్ బాటీళ్ళు తీసుకువ‌స్తున్నారు. అలిపిరి వ‌ద్ద చెకింగ్ స‌రిగ్గా జ‌ర‌గ‌డం లేదు.

ఈవో : చ‌ర్య‌లు తీసుకుంటాం.

14.మ‌నోహ‌ర్ – మ‌స్క‌ట్‌

ప్ర‌శ్న : ఆన్‌లైన్‌లో తిరుమ‌ల‌లో వ‌స‌తి బుక్ చేసుకున్నాను. ఇంకా ఎలాంటి మెసేజ్‌లు రాలేదు.

ఈవో : మా అధికారులు మీతో మాట్లాడి చ‌ర్య‌లు తీసుకుంటారు.

15. ల‌క్ష్మీ – విశాఖ‌ప‌ట్నం

ప్ర‌శ్న : దాత‌లు ద‌ర్శ‌నానికి ఎలా వెళ్ళ‌లి అనే దానిపై బోర్డులు ఏర్పాటు చేయండి.

ఈవో : అధికారుల‌తో మాట్లాడి అవ‌స‌ర‌మైన ప్రాంతాల్లో సైన్‌బొర్డులు ఏర్పాటు చేస్తాం.

16. దుర్గ‌ప్ర‌సాద్ – కాకినాడ‌

ప్ర‌శ్న: శ్రీ‌వారి సేవ ఆఫ్‌లైన్‌లో ఒక ఆధార్‌కు రెండు ఫోన్ నెంబ‌ర్లు ఉండ‌టం వ‌ల్ల ఆన్‌లైన్‌లో బుక్ కావ‌డం లేదు.

ఈవో : మా అధికారులు మీతో మాట్లాడతారు.

17. సౌజ‌న్య – హైద‌రాబాద్‌

ప్ర‌శ్న : వ‌యోవృద్ధులు, దివ్యాంగుల‌కు స‌హ‌య‌కులుగా భార్య / భ‌ర్త కాకుండా వారి కుటుంబ‌స‌భ్యుల‌ను అనుమ‌తించండి.

ఈవో : వీరికి స‌హ‌య‌కులుగా భ‌ర్య లేదా భ‌ర్త‌, శ్రీ‌వారి సేవ‌కులు ఉంటారు. ప‌రిశీలిస్తాం.

18. శ్రీ‌కాంత్ – హైద‌రాబాద్‌

ప్ర‌శ్న : ఆన్‌లైన్‌లో వ‌యోవృద్ధులు ద‌ర్శ‌నం బుక్ చేసుకోవ‌డం చాలా బాగుంది. కానీ మూడు నెల‌ల ముందు బుక్ చేసుకుంటే వారి ఆరోగ్య ప‌రిస్థితి దృష్ట్యా బుకింగ్ స‌మ‌యాన్ని త‌గ్గించండి.

ఈవో : ప‌రిశీలిస్తాం.

19. రాధ – విశాఖ‌ప‌ట్నం

ప్ర‌శ్న : శ్రీ‌వారి సేవ‌కుల‌కు గ‌తంలో 3, 5 రోజుల సేవ ఉండేది. ప్ర‌స్తుతం 7 రోజుల సేవ మాత్ర‌మే ఉంది. తిరిగి 3, 5 రోజుల సేవ ప్ర‌వేశ‌పెట్టండి.

ఈవో : శ్రీ‌వారి సేవ‌కుల‌కు అవ‌గాహ‌న‌ క‌ల‌గ‌డానికి రెండు రోజులు ప‌డుతుంది. కావున శ్రీ‌వారిసేవ 7 రోజులుగా నిర్ణ‌యించాం.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.