DIAL YOUR EO ON OCT 6_ అక్టోబరు 6న డయల్‌ యువర్‌ ఈవో

Tirumala, 4 October 2017: The monthly Dial Your EO programme will take place at Annamaiah Bhavan in Tirumala on October 6 between 8:30am and 9:30am.

The devotees can directly speak to TTD EO Sri Anil Kumar Singhal on phone number 0877-2263261 and put forth their suggestions, feedback if any.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అక్టోబరు 6న డయల్‌ యువర్‌ ఈవో

అక్టోబరు 04, తిరుమల, 2017: ప్రతినెలా మొదటి శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల నడుమ నిర్వహించే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అక్టోబరు 6వ తేదీన జరుగనుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలియజేయవచ్చు. ఇందుకోసం భక్తులు సంప్రదించాల్సిన నంబరు : 0877-2263261.

అక్టోబరు 6న ఉదయం 10 గంటలకు 2018, జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఆన్‌లైన్‌ కోటాను విడుదల చేయనున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.