FESTIVALS AT SRI GT IN OCTOBER_ అక్టోబరులో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, 4 October, 2017: Following are the details of the special festivals to be held at the Sri Govindaraja Swamy Temple in the month of October.

On October 5 evening, Pournami day, Sri Govindaraja swamy will give darshan to devotees on Garuda Vahanam.

On Octoebr 6, 13, 20 and 27 on all Fridays the deity Andal Ammavaru will come out in procession on temple mada streets.

On 10th Sri Parthasaratha swamy along with consorts Rukmini, Sathyabhama will give darshan to devotees. Similarly on October 18 morning Koil Alwar Thirumanjanam will be performed and Asthanam in the evening. Deeparathana on October 19th evening as part of Deepavali.

Thirumala Nambi utsavam will be performed from October 14 to 23 and on the last day Sri Govindarajaswamy will participate with Bhudevi and Sridevi along with Thirumala Nambi on the GRT mada streets.

On October 16 to 25 Manavala Mahamuni utsavam will be held and on last day Sri Govindarajaswamy will participate with Bhudevi and Sridevi along with Manavala Mahamuni on a procession on GRT mada streets.

On October 26, Senai Mudiliyar Sathumora will be conducted.

Sri Vendanta Sikar utsavam will be performed at GRT from October 19 to 28 and on last day Sri Govindarajaswamy will participate with Bhudevi and Sridevi along with Vendanta Sikaron a procession on GRT mada streets.

Finally the annual Thiru Nakshatra festivals will be performed on October 28 for Sri Poyagai Alwar, 29th for Sri Bodatalwar and 30th for Sri Peyualwar.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

అక్టోబరులో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

అక్టోబరు 04, తిరుపతి, 2017: తిరుపతిలో టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో అక్టోబరులో జరుగనున్న ఉత్సవాల వివరాలిలా ఉన్నాయి.

– అక్టోబరు 5న పౌర్ణమి సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామివారు సాయంత్రం 6 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.

– అక్టోబరు 6, 13, 20, 27వ తేదీల్లో శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు ఆలయ మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు.

– అక్టోబరు 10న రోహిణి నక్షత్రం సందర్భంగా రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు సాయంత్రం 5.30 గంటలకు భక్తులకు అభయమిస్తారు.

– అక్టోబరు 18న ఉదయం 6 గంటలకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. అదేరోజు సాయంత్రం 4 గంటలకు ఉత్తరా నక్షత్రం సందర్భంగా ఆస్థానం చేపడతారు.

– అక్టోబరు 19న దీపావళి సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు దీపారాధన నిర్వహిస్తారు.

– అక్టోబరు 14 నుంచి 23వ తేదీ వరకు తిరుమలనంబి ఉత్సవం జరుగనుంది. చివరిరోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ తిరుమలనంబితో కలిసి సాయంత్రం 5.30 గంటలకు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

– అక్టోబరు 16 నుంచి 25వ తేదీ వరకు మనవాళ మహాముని ఉత్సవం జరుగనుంది. చివరిరోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ మనవాళ మహామునితో కలిసి రాత్రి 8.30 గంటలకు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.

– అక్టోబరు 26న సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు సేనై మొదలియార్‌ సాత్తుమొర జరుగనుంది.

– అక్టోబరు 19 నుంచి 28వ తేదీ వరకు వేదాంతదేశికర్‌ ఉత్సవం జరుగనుంది. చివరిరోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ వేదాంతదేశికర్‌తో కలిసి రాత్రి 8 గంటలకు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

– అక్టోబరు 28న శ్రీ పొయ్‌గై ఆళ్వార్‌, 29న శ్రీ బూదత్తాళ్వార్‌, 30న శ్రీ పేయాళ్వార్‌ వర్ష తిరునక్షత్ర ఉత్సవాలు జరుగనున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.