DIAL YOUR EO EXCERPTS _ డయల్‌ యువర్‌ ఇ.ఓ

TIRUMALA, October 4: Dial Your EO programme held at Annamaiah Bhavan in Tirumala on Friday where in TTD EO Sri M G Gopal interacted with the pilgrim callers and received their suggestions and complaints over phone and responded to their queries. Some excerpts of the meeting:

Answering a pilgrim caller, Sri Madhukar from Sholapur of Maharastrawho complained of poor maintenance of taps and water leakage inSapthagiri guest house in Tirumala, the EO responding quickly to hiscomplaint said the Engineering officials will immediately rectify the defects if any.

 Another caller Smt Durga from Hyderabad who suggested the TTD EO to consider for an alternative security check near Alipiri since it is becoming difficult for aged to get down near the check post with baggage. The EO replied that due to security measures, the checking is mandatory for every one but however he said, he will instruct the vigilance officials to think about alternative ways to check aged people without putting them to inconvenience. Another caller Smt Nagaratnam from Tadipatri of Anantapur district requested to telecast Mahabharatam pravachanam episodes in SVBC every day instead of week ends alone. Answering the query the EO said, since other programmes need to be accommodated several other spiritual programmes with in the limited space available it will not be possible to telecast Mahabharatam all through the week, but however he assured to allocate couple of more days for the programme.

Answering a pilgrim caller Sri BalaVenkateswarulu of Indore, Madhya Pradesh, the EO assured him to increase the number of ticket issuing counters in Tirumala RTC bus stand after negotiating with the department officials. Another caller Sri Mani from Tirupati suggested EO to make arrangements to make every pilgrim wear Tirunamam during Brahmotsavams. Answering the caller, the EO said, TTD has already implemented the same in VQC I and some other areas and the Srivari Seva volunteers are already rendering the service of wearing Tirunamam to visiting pilgrims in these areas. Earlier in his address, the EO extended an invitation to the pilgrims across the country and abroad to take part in the annual Brahmotsavams which are set ready to start from 5th October. “TTD has made elaborate arrangements in terms of transportation and other facilities to the pilgrims in spite of the agitations. So pilgrims can take part in the mega religious fete without any hesitation”, he maintained.

Later talking to media persons over Brahmotsavam arrangements, the EO said, in the wake of two-day bandh call given by Samaikhyandhra JAC TTD has made elaborate food arrangements to the visiting pilgrims near Alipiri, Tirupati Railway Station, Srinivasam and Vishnunivasam in Tirupati and Bus Stand, Rambhageecha rest house and CRO office in Tirumala.

JEOs Sri KS Sreenivasa Raju, CVSO Sri GVG Ashok Kumar, CE Sri Chandrasekhar Reddy and other officials were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డయల్‌ యువర్‌ ఇ.ఓ

తిరుమల, 04 అక్టోబరు 2013 : శుక్రవారం నాడు తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన డయల్‌ యువర్‌ ఇ.ఓ కార్యక్రమంలో భక్తుల అడిగిన ప్రశ్నలకు, చేసిన సూచనలకు తితిదే ఇఓ శ్రీ ఎం.జి.గోపాల్‌ స్పందించారు. వీటిలో కొన్ని ముఖ్యమైనవి –


1. ప్రభాకర్‌రెడ్డి – హిందూపురం
1. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో రూ.50/- సుదర్శన టోకెన్లు మంజూరుచేయాలి.
2. దళిత గోవిందం కార్యక్రమాన్ని తిరిగి ప్రవేశపెట్టాలి.
ఇ.ఓ. 1. దేశవ్యాప్తంగా గల 86 ఈ-దర్శన్‌ కౌంటర్లలో రూ.50/- సుదర్శన టోకెన్లు మంజూరు చేస్తున్నాం. మీకు సమీపంలోని ఈ-దర్శన్‌ కౌంటర్‌లో సుదర్శన టోకెన్‌ తీసుకోవచ్చు.
2. దళిత గోవిందం స్థానంలో శ్రీనివాస కల్యాణాలను అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాం.
2. శ్రీనివాస్‌ – కోలార్‌
తిరుపతిలోని రైల్వేస్టేషన్‌, బస్టాండు నుండి అలిపిరికి బస్సుల్లేవు. బస్సులు నడపండి.
ఇ.ఓ ఆర్‌టిసి అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటాం.
3. అనిల్‌కుమార్‌ – మదనపల్లి
శ్రీవారి కల్యాణకట్ట సేవ చేసే కక్షురకులకు తగిన వసతులు లేవు.
ఇ.ఓ సంబంధిత డెప్యూటీ ఈవోగారికి తెలియజేయండి.
4. బాలవేంకటేశ్వర్లు – ఇండోర్‌, మధ్యప్రదేశ్‌
తిరుమలలోని ఆర్‌టిసి బస్టాండులో టికెట్‌ కౌంటర్ల సంఖ్యను పెంచాలి.
ఇ.ఓ తప్పకుండా ఆర్‌టిసి అధికారులకు తెలియజేస్తాం.
5. వి.ప్రసాద్‌, తిరుపతి
కపిలతీర్థం ఆలయంలో సిబ్బంది ప్రవర్తన సరిగా లేదు, సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి. లగేజి సెంటర్‌ పెట్టాలి.
ఇ.ఓ కపిలతీర్థం ఆలయంలోని కల్యాణకట్ట వద్ద లగేజి సెంటర్‌ ఏర్పాటు కోసం నిర్మాణం జరుగుతోంది. సిబ్బంది ప్రవర్తనపై తగిన చర్యలు తీసుకుంటాం.
6. దీప్తి, చెన్నై
శ్రీవారి దర్శనక్యూలైన్లలో కొందరు భక్తులు ఇతర భక్తులను నెట్టి ముందుకు వెళుతున్నారు. అలాంటి వారిని నిలువరించేందుకు సిబ్బందిని ఏర్పాటుచేయాలి.
ఇ.ఓ భక్తులు ఎవరికి వారు స్వయం నియంత్రణ పాటించాలి. తితిదే విజిలెన్స్‌ సిబ్బంది, పోలీసులు, శ్రీవారి సేవకుల ద్వారా క్యూలైన్లను క్రమబద్ధీకరిస్తున్నాం.
7. నాగరత్నం, తాడిపత్రి
శ్రీ వేంకటేశ్వ భక్తి ఛానల్‌లో వారానికి రెండు రోజుల పాటు ప్రసారం చేస్తున్న మహాభారతాన్ని ప్రతిరోజూ ప్రసారం చేయాలి. ఉపనిషత్తులన్నీ ప్రవచనం చేయాలి.
ఇ.ఓ మహాభారతాన్ని వారంలో మూడు రోజుల పాటు ప్రసారం చేసేందుకు ప్రయత్నిస్తాం. శ్రీవారి బ్రహ్మోత్సవాల కారణంగా ఉపనిషత్తుల ప్రవచనాలను తాత్కాలికంగా ఆపేశాం. ప్రవచనాల ప్రసారాన్ని తిరిగి కొనసాగిస్తాం.
8. దుర్గ – హైద్రాబాద్‌
1. అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద వృద్ధులు లగేజీ మోసుకుని దిగడానికి మినహాయింపు ఇవ్వండి.
2. బంగారు వాకిలి వద్ద భక్తుల తోపులాట ఎక్కువగా ఉంది, నియంత్రించండి.
3. మూడు సంవత్సరాలుగా సుప్రభాతం టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నా లభించలేదు.
ఇ.ఓ 1. అలిపిరి చెక్‌పాయింట్‌లో తనిఖీ కోసం లగేజి మోసుకుని బస్సు దిగలేని వృద్ధుల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుని వారికి ఇబ్బందులు లేకుండా చేస్తాం.
2. బంగారు వాకిలి వద్ద భక్తులు ఎవరికి వారు సంయమనం పాటించి స్వామివారిని దర్శించుకోవాలి.
3. సుప్రభాతం సేవా టికెట్లను ఈ-దర్శన్‌ కౌంటర్లు, తిరుమలలోని సిఆర్‌ఓ కార్యాలయం వెనక గల కరంట్‌ బుకింగ్‌ కౌంటర్‌, ఇంటర్నెట్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు.
9. మణి – తిరుపతి
శ్రీవారి బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజుల్లో తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి తిరునామం పెట్టాలి.
ఇ.ఓ ఇప్పటికే అన్ని కాటేజీల్లో భక్తులు తిరునామం ధరించే వీలుంది. నడకమార్గంలో వచ్చే భక్తులకు కూడా  నిర్ణీత ప్రాంతాల్లో తిరునామం పెట్టేందుకు చర్యలు తీసుకుంటాం.
10. వేంకటేశ్వర్లు – బళ్లారి
నిజపాదదర్శనం సేవలో కులశేఖరపడి వరకు భక్తులను అనుమతిస్తే చూసేందుకు అనువుగా ఉంటుంది. ఎస్వీబీసీ, సప్తగిరి మాసపత్రికలో ఆంగ్ల పదాలను తగ్గించి తెలుగు వాడకం పెంచాలి.

ఇ.ఓ పరిశీలిస్తాం.

ఈ కార్యక్రమంలో తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, సి.వి.ఎస్‌.ఓ శ్రీ జి.వి.జి అశోక్‌కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి, ఆలయ డిప్యూటి ఇ.ఓ శ్రీ చిన్నంగారి రమణ, ఎస్‌.ఇ2 శ్రీ రమేశ్‌ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమ అనంతరం ఇ.ఓ మీడియాతో మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఎన్‌జివోలు చేపట్టిన బంద్‌ కారణంగా శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులకు తిరుమల, తిరుపతిలో విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. తిరుపతిలో ఆగిపోయిన భక్తులకు రైల్వేస్టేషన్‌, శ్రీనివాసం, విష్ణునివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, అలిపిరి బస్డాండు వద్ద ఉచితంగా సాంబారన్నం, పెరుగన్నం, కాఫీ, టీ, పాలు పంపిణీ చేస్తున్నామన్నారు. తిరుమలలో నిలిచిపోయిన భక్తుల కోసం పాదాలమండపం, సిఆర్‌వో, రాంభగీచా అతిథిగృహం, రెండు ఆర్‌టిసి బస్టాండ్లు, ఇతర ముఖ్య కూడళ్లలో అన్నప్రసాదం అందజేస్తున్నామని, అపరాధ రుసుం లేకుండా అద్దె గదుల్లో భక్తులకు బస కల్పిస్తున్నామని వెల్లడించారు.

గత డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో భక్తులు అందించిన సూచనలపై తీసుకున్న చర్యలను ఈవో వివరించారు. స్టెంట్లు అమర్చుకున్న భక్తులను వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి స్వామివారి దర్శనానికి అనుమతిస్తామన్నారు. భక్తుల పట్ల దురుసు ప్రవర్తించిన తితిదే సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. శ్రీవారి సేవకుల్లో మహిళలు, పురుషులకు వేరువేరుగా బస కల్పించినట్టు చెప్పారు. ఎస్వీబీసీలో శ్రీ వేంకటేశ్వర ప్రపత్తిని ప్రసారం చేస్తున్నట్టు తెలిపారు. సప్తగిరి మాసపత్రికలో అక్టోబరు సంచిక నుండి ఎనిమిది పేజీలు సంస్కృతంలో ప్రచురిస్తున్నట్టు వివరించారు.
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.