TTD-JEO TML ADDRESSING THE SECURITY GUARDS AT TIRUMALA _ భక్తుల భద్రతే లక్ష్యం కావాలి : తిరుమల జెఈవో

SEE THAT NO INCONVENIENCE IS CAUSED TO PILGRIMS-TIRUMALA JEO

The Tirumala JEO Sri KS Sreenivasa Raju called upon over 500 vigilance and security sleuths of TTD to offer sincere services to see that no inconvenience is caused to the visiting pilgrims during brahmotsavams.

Addressing the vigilance sleuths on Brahmotsavam security arrangements in  Centralised Command and Control centre in PAC IV on Thursday, the JEO said, though there is bandh, since the brahmotsavams begins on Puratasi Saturday, which is considered very auspicious especially for Tamils, the pilgrims may throng the holy hills through foot path route. “Though there is little mode of transport to Tirumala due to Samaikhyandhra bandh, the devotees might prefer the two foot path routes to reach Tirumala. So be attentive in your duties and responsibilities and see that the pilgrims are not put to any sort of inconvenience”, he asserted.

Later he instructed the cops to see that no one enter or deviate the specified zones during the procession of various vahana sevas during brahmotsavams. “In front of each vahanam there will be Kalajathas, Vaidika Haram and Security. The pilgrims should be properly maintained in the galleries and see that the processions take place in a hassle free manner”, he ordered.

CVSO Sri GVG Ashok Kumar, Additional CVSO Sri Sivakumar Reddy, the AVSOs of all sectors were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తుల భద్రతే లక్ష్యం కావాలి : తిరుమల జెఈవో

తిరుమల, 04 అక్టోబరు 2013 : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల భద్రతే లక్ష్యంగా విజిలెన్స్‌ సిబ్బంది విధులు నిర్వహించాలని  తితిదే తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పిలుపునిచ్చారు. తిరుమలలోని పాత అన్నదానం భవనంలో గల సెంట్రల్‌ కమాండింగ్‌ సెంటర్‌లో శుక్రవారం తితిదే విజిలెన్స్‌ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన తిరుమల జెఈవో ప్రసంగిస్తూ బ్రహ్మోత్సవాల్లో తితిదే విజిలెన్స్‌ సిబ్బంది పాత్ర కీలకమైందన్నారు. మాడ వీధుల్లో అప్రమత్తంగా ఉండి వాహనసేవను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత విజిలెన్స్‌ సిబ్బందిదే అన్నారు. గరుడసేవ, రథోత్సవం, చక్రస్నానం లాంటి ప్రముఖ రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. పెరటాశి నెల శనివారం కావడంతో బ్రహ్మోత్సవాల మొదటిరోజే విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశముందని, రద్దీకి అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని కోరారు.

తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈసారి బ్రహ్మోత్సవాలకు కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య పెరగనుందని, ఆ మేరకు నడకమార్గంలో సిబ్బంది భద్రత కల్పించాలని సూచించారు. గరుడసేవకు విశేష సంఖ్యలో భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో తిరుమలలోని అన్ని కూడళ్లలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. పోలీసులు, ట్రాఫిక్‌ సిబ్బందితో సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని విజిలెన్స్‌ సిబ్బందిని కోరారు.

ఈ కార్యక్రమంలో తితిదే అడిషనల్‌ సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, తిరుమల, తిరుపతి అడిషనల్‌ ఎస్పీ శ్రీ ఉమామహేశ్వరశర్మ, పోలీసు, ట్రాఫిక్‌, ఎన్‌డిఆర్‌ఎఫ్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.