DIAL YOUR EO EXCERPTS_ ‘డయల్ యువర్ ఈవో ‘లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
PRIVILEGE DARSHAN FOR AGED AND PHC IS NOT CANCELLED-TTD EO
Tirumala, 4 May 2018: Clearing the air, TTD EO Sri Anil Kumar Singhal said, TTD has not cancelled the privilege darshan for aged and differently able pilgrims but only has not released the additional quota owing to summer rush in Tirumala for the months of May and June.
Answering the pilgrim callers from different parts of the country during Dial your EO programme held at Annamaiah Bhavan in Tirumala on Friday, the EO clarified the doubts raised by pilgrim callers Sri Tata Rao from Vizag and Sri Aiyyappa from Guntur saying that the normal quota of 1400 tickets which is issued every day in two slots with 700 in each slot for aged and physically challenged pilgrims will be issued as usual except for Friday where there is only slot. In addition to that TTD has been issuing 4000 tickets to this category pilgrims on any two lean days since August last. This additional quota is cancelled for the month of May and June as there is heavy summer vacation rush in Tirumala”, the EO elaborated.
ENSURE PROPER DUSTING
Another pilgrim caller Sri Manohar from Tirupati brought to the notice of EO that proper dusting has not been done from the past many days in Annamacharya Kalayamandiram (AKM) and also in Mahati Auditorium. He also said, earlier the prasadam from Sri Kodanda Rama Swamy temple used to be distributed to the deovtees in AKM which has now stopped from the past one year. Reacting to this caller, the EO said he will ensure proper regular dusting and cleaning by instructing the concerned and also revive the distribution of prasadam.
GIVE UPDATED INFORMATION IN SAPTHAGIRI
A caller Sri Haribabu from Vijayawada sought EO to give updates on the developmental activities of TTD like introduction of Slotted Sarva Darshan (SSD) counters, on PACs, Luggage counters etc. in Tirumala and Tirupati for better information of pilgrim public in TTD-run Sapthagiri devotional magazine, for which the EO welcomed the suggestion.
SOFT SKILLS TO CALL CENTRE STAFFS
Callers Sri Ramamurthy from Khammam and Sri Kumar from Chittoor suggested EO to train the call centre employees of TTD on soft communication skills while they interact with the pilgrims. The EO said the concerned will be instructed to give proper training to the call centre staff on how to deal with the pilgrims.
KEEP THE BATHROOMS TIDY IN TIRUCHANOOR
Another caller Smt Padma from Chirala sought to ensure cleanliness in bathrooms at Tiruchanoor for which the EO said it will be immediately taken up.
MAKE ANNOUNCEMENTS ON NOT TO WASTE ANNAPRASADAMS
A caller Sri Krishnamurthy from Chittoor advised EO to make announcements at main Annaprasadam Complex and other food distribution places on not to waste food as many pilgrims are wasting the food. The EO said awareness will be created among pilgrims as well to Srivari Seva volunteers on not to waste the food while serving to pilgrims.
RETHINK ON FLY TRAPS IN SRIVARI TEMPLE
A pilgrim caller Sri Kalyana Srinivas from Hyderabad informed the EO to rethink on keeping fly traps at some points in Srivari temple to avoid the menace of flies. Replying the caller EO said, the possibility of his suggestion will be looked into.
ELECTRONIC DIP IS A TRANSPARENT SYSTEM
Callers Sri Tulsiram from Miryalaguda, Sri Krishnamurthy from Bengaluru, Sri Sekhar from Nellore, Sri Viswanatha Sarma from Hyderabad, Smt Ramadevi from Narasapuram raised queries on Electronic dip system for which the EO answered that the allotment of arjitha seva tickets in on-line is a transparent system being operated successfully by TTD.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆన్‌లైన్‌లో 56,310 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల
ఆగస్టు 12 నుండి 16వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ
‘డయల్ యువర్ ఈవో ‘లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
మే 04, తిరుమల, 2018: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి ఆగస్టు నెల కోటాలో మొత్తం 56,310 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు తెలియచేశారు. ఆన్‌లైన్ డిప్ విధానంలో 9,960 సేవా టికెట్లు విడుదల చేశామని. ఇందులో సుప్రభాతం 6,805, తోమాల 80, అర్చన 80, అష్టదళపాదపద్మారాధన 120, నిజపాదదర్శనం 2,875 టికెట్లు ఉన్నాయని ప్రకటించారు. ఆన్‌లైన్ జనరల్ కేటగిరిలో 46,350 సేవాటికెట్లు ఉన్నాయి. వీటిలో విశేషపూజ 1500, కల్యాణం 10,925, ఊంజల్‌సేవ 3,450, ఆర్జితబ్రహ్మూెత్సవం 6,325, వసంతోత్సవం 11,550, సహస్రదీపాలంకారసేవ 12,600 టికెట్లు ఉన్నాయని వివరించారు.
అదేవిధంగా శ్రీవారి ఆలయంలో 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని ఆగస్టు 12 నుండి 16వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.
తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.
1. తాతారావు – వైజాగ్, అయ్యప్ప – గుంటూరు
ప్రశ్న : శ్రీవారి దర్శనానికి విచ్చేసే వృద్దులు, దివ్యాంగులకు ఇచ్చే ప్రత్యేక దర్శనాలను మే, జూన్ నెలలో టిటిడి రద్దు చేసింది ?
ఈ.వో. ప్రతి రోజు వృద్ధులు, దివ్యాంగులకు ఇచ్చే 1400 టోకెన్లు చిన్నపిల్లల తల్లిదండ్రులకు ఇచ్చే ప్రత్యేక దర్శనాలు యధావిధిగా కొనసాగుతాయి. వేసవి రద్దీ నేపధ్యంలో ప్రతి నెల రెండు అతి సాధారణ రద్దీ
ఉన్న రోజులలో వృద్ధులు, దివ్యాంగులకు ఇచ్చే 4 వేల ప్రత్యేక దర్శనం టోకెన్లను మాత్రమే మే, జూన్ నెలలో రద్దు చేశాం.
2. నరసింహచ్చారి – భువనగిరి
ప్రశ్న – గతంలో టిటిడి దళితవాడల్లో శ్రీవారి కల్యాణాలు నిర్వహించేవారు. మా ప్రాంతంలోను కల్యాణాలు నిర్వహించగలరు ?
ఈ.వో. ప్రస్తుతం శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రణాళికా బద్ధంగా వివిధ ప్రాంతాలలో శ్రీవారి కల్యాణాలు నిర్వహిస్తున్నారు. మీ ప్రాంతంలోను మా అధికారులు పరిశీలించి స్వామివారి కల్యాణాలు నిర్వహిస్తారు.
3. లక్ష్మీ – రాజమండ్రి
ప్రశ్న – ఎస్వీబిసిలో ఉదయం ప్రసారంచేసే సుప్రభాతసేవ నమూనా ఆలయం నుండి లైవ్ వస్తుందా –
ఈ.వో. ప్రత్యక్ష ప్రసారం ఉండదు. రికార్డింగ్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాం.
4. నరసింహులు – కుప్పం
ప్రశ్న – మా గ్రామంలోని ఆలయానికి టిటిడివారు అందించే సబ్సిడి మైక్‌సెట్లు కావాలంటే టిటిడి బోర్డు సభ్యుల సిఫార్సు లెటరు కావాలా ?
ఈ.వో. ఆలయానికి అవసరమైన మైక్‌సెట్స్ టిటిడి నిబందనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకున్నవారందరికి అందిస్తుంది.
5. హైమావతి – గురుగుమల్లి
ప్రశ్న – జూన్ 9వ తేదీన తిరుమలలో కల్యాణం టికెట్లు పొందాము, అందులో వృద్ధులను తీసుకురావచ్చా?
ఈ.వో. టికెట్టు పొందినవారిని మాత్రమే అనుమతిస్తారు.
6. సురేంద్ర – దేవుని కడప
ప్రశ్న – దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో స్వామివారిని ఊరేగించేటప్పడు నైవేధ్యం సమర్పించడం లేదు, అదేవిధంగా స్థానికులు చనిపోయినప్పుడు, ఆలయంలో నైవేద్యం, హారతి రద్దు చేస్తున్నారు, ఆలయంలో ఎ.సి. ఏర్పాటు చేయండి ?
ఈ.వో. సాధారణంగా కొన్ని సంప్రదాయాలు శాస్త్రబద్ధంగా నిర్వహించవలసి వుంటుంది. ఇంకా నైవేద్యం, హారతి విషయాలకు సంబంధించి అధికారుల బృందాన్ని పంపి, తగిన చర్యలు తీసుకుంటాం.
7. మనోహర్ – తిరుపతి
ప్రశ్న – తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలోని అన్నమయ్య విగ్రహానికి తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం నుండి ప్రతిరోజు నైవేధ్యం సమర్పించేవారు. నైవేధ్యం సమర్పించేలా చర్యలు తీసుకోండి. అదేవిధంగా అన్నమాచార్య కళామందిరం, మహతి కళాక్షేత్రంలో పైకప్పుకు బూజులు ఎక్కువగా వున్నాయి. వాటిని తొలగించేలా చర్యలు తీసుకోండి ?
ఈ.వో. పరిశీలించి చర్యలు తీసుకొంటాం. బూజును వెంటనే తొలగిస్తాం.
8. రవిచంద్రన్ – చెన్నై
ప్రశ్న – శ్రీవారిని 40 అడుగుల దూరం నుండి దర్శించుకుంటున్నాము, 20 అడుగుల దూరం నుండి దర్శించుకునే అవకాశం కల్పించండి ?
ఈ.వో. ఇలా చేస్తే భక్తులందరికి స్వామివారి దర్శనం కల్పించలేము.
9. హరిబాబు – విజయవాడ
ప్రశ్న – సప్తగిరి మాస పత్రిక బ్లాక్ అండ్ వైట్‌లో బాగా ఉండేది, అందులో టిటిడి సమాచారం బాగా అందించేవారు. ముందులా సమాచారం అందివ్వండి ?
ఈ.వో. మీరు ఇచ్చిన సూచనలు పాటించి నాణ్యత పెంచుతాము. ఎప్పటికప్పుడు టిటిడి చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రచురిస్తాం.
10. శేఖర్ – నెల్లూరు, రమాదేవి – నరసాపురం, కృష్ణమూర్తి – బెంగుళూరు
ప్రశ్న – 1.ఆర్జిత సేవలు ఆన్‌లైన్‌లో దొరకడం లేదు. ముందు విధానమే బాగుంది ?
2.లాటరీ సేవాటికెట్లు నమోదు కావడం లేదు, ప్రతి జిల్లాకు కొన్ని చొప్పన టికెట్లు ఇవ్వండి ?
ఈ.వో. ప్రస్తుతం ఆన్‌లైన్ విధానం వందశాతం పారదర్శకంగా ఉంది. ఆర్జితసేవలకు లక్ష మంది నమోదు చేసుకుంటున్నారు, 5 వేల మందికి టికెట్లు మంజూరు చేస్తున్నాం.
11. రమణమూర్తి – ఖమ్మం, కుమార్ – చిత్తూరు
ప్రశ్న – 1.సప్తగిరి అతిధి భవనంలో స్నానపు గదిలో నీరు బయటకు వస్తుంది ?
2.గీజర్ పని చేయడం లేదని కాల్‌సెంటర్‌కు ఫోన్ చేస్తే స్పందన సరిగ్గా లేదు ?
ఈ.వో. తగిన చర్యలు తీసుకుంటాం, ఇకముందు ఇలా జరగకుండా చూస్తాం.
12. విశ్వనాధశర్మ – హైదరాబాదు
ప్రశ్న – ఆర్జితసేవలు ఒకే పేరు మీద నమోదు చేసుకోవచ్చా. చిన్నలడ్డును ఉచితంగా ఇస్తున్నారు, అదేవిధంగా జిలేబి, వడ ప్రసాదాలను విక్రయించేలా చర్యలు తీసుకోండి. శ్రీవారి అభిషేకంను మా పిల్లలకైన బుక్ చేసుకునే అవకాశం కల్పించండి ?
ఈవో. లక్కిడిప్ ద్వారా అన్ని సేవలు పొందవచ్చు. సేవా టికెట్లు పొంది రాలేక పోతే తిరుమలలో లాటరీ పద్ధతిలో అవకాశం కల్పిస్తున్నాం. లడ్డూ ప్రసాదాలను ఇస్తున్నాం. ప్రత్యేక సేవలకు మాత్రమే జిలబి, వడ అందిస్తున్నాము.
13. కృష్ణమూర్తి – చిత్తూరు
ప్రశ్న. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదాలు వృధా చేయరాదని రికార్డింగ్ వాయిస్ పెట్టండి ?
ఈ.వో. బాగుంది, అలాగే చేస్తాం.
14. శ్రీనివాసరెడ్డి – కర్నులు
ప్రశ్న. 10 రోజుల క్రితంకాలినడక మార్గంలో తిరుమలకు వచ్చాం టోకెన్లు పరిమిత సంఖ్యలో ఇచ్చారు ?
ఈవో. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో నడిచివచ్చే భక్తులకు ప్రతి రోజు 20వేల టోకెన్లు ఇస్తున్నాం. కావున అందరికి దివ్యదర్శనం టోకెన్లు ఇవ్వలేము.
15. పద్మా – చీరాల
ప్రశ్న – తిరుచానూరులోని యాత్రికుల వసతి సమూదాయంలో పారిశుద్ధ్యం బాగాలేదు ?
ఈ.వో చర్యలు తీసుకుంటాం.
16. చంద్రశేఖర్ – మంగళగిరి
ప్రశ్న – కల్యాణ కట్టలో డబ్బులు అడుగుతున్నారు, తిరుమలలోని గదులలో నల్లులు, పారిశుద్ధ్యం బాగాలేదు చర్యలు తీసుకొండి.
ఈ.వో. కల్యాణకట్టలో డబ్బులు అడుగుతున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. గదులలో ఎలాంటి సమస్యలు వున్న ఎఫ్‌ఎమ్‌ఎస్ నంబరుకు కాల్‌చేయండి.
17. తులసీరామ్ – మిర్యాలగూడ
ప్రశ్న – రూ.50- , రూ.100- టికెట్లు తీసేశారు, సామాన్యులకు చాలా ఇబ్బందిగా ఉంది ?
ఈ.వో. భక్తులు అధిక సమయం క్యూలైన్లలో వేచి ఉండకుండా, నిర్ణిత ససయంలో స్వామివారి దర్శనం కల్పించేందుకు టిటిడి నూతనంగా సమయ నిర్దేశిత సర్వదర్శనంను ప్రవేశపెట్టింది.
18. కల్యాణ శ్రీనివాస్ – హైదరాబాదు
ప్రశ్న – శ్రీవారి ఆలయంలో ఈగలను ప్లయ్‌ట్రాప్స్ ద్వారా అదుపుచేయడం సమంజసమా ?
ఈ.వో. పారిశుద్ధ్య చర్యల్లో భాగంగా దానిని ఏర్పాటు చేశాం.
ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్, ఎస్వీబీసీ ఇన్‌చార్జి సిఈవో శ్రీ ముక్తేశ్వరరావు, సిఇ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.