DIAL YOUR EO EXCERPTS _ డయల్‌ యువర్‌ ఇ.ఓ

TIRUMALA, FEB 1:  The Dial Your EO Programme took place at Annamaiah Bhavan in Tirumala on Friday where in the TTD EO Sri LV Subramanyam directly answered to the queries of the pilgrims callers across the country. Some excerpts:
 
Answering to a caller Mrs Kalavathi from Rajamundry, the EO said TTD will think about the possibility of introducing mini vadas to distribute among the pilgrims. Reacting to the query of another caller Sri Santosh from Vizag the EO said, already there exists a dairy farm in MBC area for the sake of the pilgrims coming with infants. However he said, TTD is also negotiating with the state government to introduce more dairy centres in Tirumala soon.
 
Earlier addressing the pilgrims at the beginning of the programme the TTD EO said that the Lord Sri Malayappaswamy will take celestial ride on seven vahanams including Suryaprabha, Chinnasesha, Garuda, Hanumantha, Kalpavriksha, Sarvabhupala and Chandraprabha vahanams as a part of the Rathsapthami festival which falls on February 17.
 
Later speaking to media persons after the dial your EO programme, he shared his memorable experiences in Maha Kumbh mela. The EO said, TTD will soon organise Srinivasa Kalyanams in Naimisaranya, Chitrakuta and Ayodhya. Adding he said, the Sri Venkateswara temple at Gol Market in New Delhi has come out very well along with a meditation hall and will be inaugurated in the month of March.
 
CVSO Sri GVG Ashok Kumar, Temple Dy EO Sri C Ramana, SE II Sri Ramesh Reddy and other officials were also present.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
డయల్‌ యువర్‌ ఇ.ఓ
 
తిరుమల, 1 ఫిబ్రవరి, 2013: శుక్రవారం నాడు తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన డయల్‌ యువర్‌ ఇ.ఓ కార్యక్రమంలో భక్తుల కొన్ని ప్రశ్నలు, సూచనలు వాటికి ఇ.ఓ శ్రీఎల్‌.వి.సుబ్రహ్మణ్యం స్పందన
1. కళావతి – రాజమండ్రి.
శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు లడ్డూ ప్రసాదంతో పాటుగా వడ ప్రసాదాన్ని కూడా పరిమాణం తగ్గించి అందించగలరు.
ఇ.ఓ. తప్పకుండా పరిశీలిస్తాం.
2. సంతోష్‌ – విశాఖపట్టణం.
చంటిపిల్లలతో విచ్చేసే భక్తులకు పాలు అందించే సౌకర్యాన్ని తి.తి.దే ఏర్పాటు చేయగలదు.
ఇ.ఓ తప్పకుండా చేస్తాం. ఇప్పటికే యం.బి.సి చెంత ఈ సౌకర్యం ఉంది. ఇది కాకుండా మరిన్ని ప్రభుత్వ డైరీ కేంద్రాలను ఏర్పాటుచేసి పాలు అందించే సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి తి.తి.దే ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నది.
3. లక్ష్మీపతి – తాడేపల్లి గూడెం, నరేంద్రబాబు – చెన్నై, నాగరాజు – కుప్పం.
తి.తి.దే కల్యాణకట్ట విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది భక్తులకు పారదర్శకంగా సేవలందిచే విధంగా  చర్యలు చేపట్టండి.
ఇ.ఓ భక్తులు కూడా కల్యాణకట్టలో సిబ్బంది వలన ఏవైనా పొరబాట్లు జరుగుతుంటే 1800-425-4141 అనే టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయగలరు.
4. కె. వెంకటేష్‌- తిరువళ్ళూరు.
మేము గత కొన్ని ఏళ్ళుగా వివిధ ఆలయాల్లో భజనలు చేస్తూ భక్తి ప్రచారం చేస్తున్నాము. దయచేసి మాకు మృదంగం వంటి సంప్రదాయ వాయిద్యపరికరాలను తి.తి.దే అందించగలదు.
ఇ.ఓ తప్పకుండా మీకు అందించే ఏర్పాట్లు చేస్తాం. అందుకుగాను మీరు తి.తి.దే హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి చిరునామాకు దరఖాస్తు అందించగలరు.
5. సుబ్బరామశాస్త్రి – హైదరాబాదు.
1. స్వామి పుష్కరిణిలో భక్తులు స్నానమాచరిస్తున్నప్పుడు అక్కడే మల విసర్జనలు చేస్తూ అపవిత్రం చేస్తున్నారు. దీనిని అరికట్టగలరు.
2. స్వామి పుష్కరిణిలో సంకల్పం చేసుకొనేందుకు పర్వదినాలలో పురోహితులను ఏర్పాటు చేయగలరు.
3. తిరుపతిలోని శ్రీనివాసం వసతి సముదాయంలో వివిధ బ్లాకుల్లో స్నానపు గదులకు తలుపులు సరిగాలేవు. ఎలుకల సమస్య తీవ్రంగా ఉంది.  
ఇ.ఓ. 1. తప్పకుండా చర్యలు చేపడతాం. 2. తప్పకుండా పరిశీలిస్తాం. 3. తప్పకుండా సమస్యను పరిష్కరిస్తాం.
ఈ కార్యక్రమంలో సి.వి.ఎస్‌.ఓ శ్రీ జి.వి.జి అశోక్‌కుమార్‌, ఆలయ డిప్యూటి ఇ.ఓ శ్రీ చిన్నంగారి రమణ, ఎస్‌.ఇ2 శ్రీ రమేశ్‌ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అనంతరం ఇ.ఓ విలేకరులతో మాట్లాడుతూ కుంభమేళా పర్యటన అనుభూతులను పంచుకున్నారు. సర్వశ్రేష్టమైన త్రివేణి సంగమంలో స్నానమాచరించడం ఒక గొప్ప అనుభవం అన్నారు. అన్నిటికంటే మించి లక్షలాది మంది భక్తులు ఒకచోట గుమికూడడం ఒక అపురూపఘట్టమన్నారు. అలహాబాదు నగరంలో ”లేతే హుయే హనుమాన్‌” (బడే హనుమాన్‌) ఆలయం మరియు వటవృక్షం చూడదగిన ఆధ్యాత్మిక ప్రదేశాలన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలో అయోధ్య, చిత్రకూట, నైమిశారణ్యాల్లో శ్రీనివాస కల్యాణాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా దేశరాజధాని ఢిల్లీలోని గోల్‌ మార్క్‌ట్‌లో నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం అత్యద్భుతంగా వచ్చిందన్నారు. మార్చినెలలో ఈ ఆలయ ప్రారంభోత్సవం ఉంటుందన్నారు.
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.