DIAL YOUR EO PROGRAM HIGHLIGHTS _ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట – డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి

SRIVARI ANNUAL BRAHMOTSAVAMS

TIRUMALA, 01 SEPTEMBER 2023: TTD EO Sri AV Dharma Reddy highlighted a few upcoming religious events and some development activities recently taken up by TTD during the Dial your EO Program held at Annmaiah Bhavan in Tirumala on Friday.

In view of adhika masam TTD is observing twin Brahmotsavam festivals in September from 18 to 26 and Navaratri Brahmotsavams from October 15 to 23.

Since the festivities synchronised with the holy Tamil Puratasi month extensive arrangements are being made for devotees convenience as large numbers are expected to participate.

The Honourable CM of AP will present Pattu Vastrams to Sri Venkateswara Swamy on September 18 on behalf of the State Government

Prominent festivities include Garuda Vahana Seva on September 22, Swarna Ratham on 23, Rathotsavam on 25, Chakra Snanam and Dwajavarohanam on 26

In view of the grand celebrations TTD has cancelled the Arjita Sevas from September 18-26 like Astadala Pada Padmaradhana, Tiruppavada, Kalyanotsavam, Unjal Seva and Sahasra Deepalankara Sevas

Devotees who had booked in advance will be however allowed for Vahana Sevas

Privileged darshans also remain cancelled for senior citizens, handicapped and parents with infants

SRIVANI FUNDS FOR DHOOP & DEEPA SEVAS IN TEMPLES

As per traditions of Sanatana Hindu Dharma, TTD is providing funds for Dhoop, Deepa and Naivedyam in  501 temples constructed in backward areas from the funds of the Srivani trust.

In the month of August, a total of ₹ 25 lakhs was released at rate of ₹5000 for each temple.

KAREERI ISTHI YAGAM

TTD organised Kareeristi Varunajapa Parjanyashanti Yagam from August 22 to 26 at Dharmagiri Veda Vijnana Peetham seeking rains and prosperity of people in both the state and country.

DEVOTEES LUGGAGE MANAGEMENT

TTD has introduced a digitised and automated system titled Balaji Baggage management system(BBMS) for easy and comfortable deposit and retrieval of devotees luggage and mobile phones.

In view of the delay in delivery of earlier, some devotees used to bring mobile phones into temple. But in the new system, they could deposit and retrieve their luggage and mobile phones in an easy and quick manner in 44 counters at 16 centres present at Tirumala and Tirupati.

TTD now maintains 60,000 mobile phones and 40,000 pieces of luggage on a daily basis.

WORKSHOP AT SHILPAKALA COLLEGE

TTD plans to conduct  a three-day workshop at its Sri Venkateswara Traditional Sculpture and Architecture College on making statues and temple buildings from September 4-6

Experts sculptors and Stapathis from AP, Telangana, Tamilnadu and Karnataka will present new skills and techniques of temple building at the workshop.

GUIDELINES TO DEVOTEES AT FOOTPATHS

In the backdrop of the movements of wild animals on the footpaths, devotees made several suggestions. 

TTD has barred the sale of fruits and vegetables on both footpaths as some devotees are buying and feeding the animals which are in turn attracting the wild animals to footpaths leading to attack on devotees.

All vendors and traders are instructed to segregate wet and dry garbage and dump them in dust bins provided only 

Mobile numbers of forest and health officials are circulated among vendors and also signages are put on footpaths for the benefit of devotees

AWARENESS ON ORGAN DONATIONS FOR TRANSPLANTS

TTD has excellent infrastructure for conducting organs transplants at SVIMS hospital and appeals to spread awareness on organ donations by those close to death for the humanitarian benefit of genuinely needy persons.

TTD encourages devotees to donate organs with special privileges to families

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట

– వాహనసేవలతో పాటు సంతృప్తికరంగా శ్రీవారి దర్శన ఏర్పాట్లు

– అన్నిరకాల ప్రివిలేజ్డ్‌ దర్శనాలు రద్దు

– త్వ‌ర‌లో తిరుచానూరులో మ‌హా వ‌రుణ యాగం

– డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి

తిరుమల, 2023 సెప్టెంబ‌రు 01: శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 18 నుండి జరుగనున్నా నేప‌థ్యంలో భక్తులకు సంతృప్తికరంగా మూలమూర్తి దర్శనంతోపాటు వాహనసేవలు వీక్షించే అవకాశం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేపడుతున్నామని ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భ‌వ‌నంలో శుక్ర‌వారం నిర్వ‌హించిన డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివ‌రాలు ఇవి.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు :

– అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్‌ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. పెరటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది కావున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తాం.

– సెప్టెంబర్‌ 18న ధ్వజారోహణం సందర్భంగా ముఖ్యమంత్రివర్యులు శ్రీవైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డిగారు రాష్ట్రప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

– ముఖ్యంగా సెప్టెంబరు 22న గరుడ సేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహిస్తాం.

– బ్రహ్మోత్సవాల కారణంగా సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకరణ సేవలు రద్దయ్యాయి. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవాటికెట్లు బుక్‌ చేసుకున్న గృహస్తులను వారికి సూచించిన వాహనసేవలకు మాత్రమే అనుమతించడం జరుగుతుంది.

– బ్రహ్మోత్సవాలలో అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడమైనది.

– బ్రహ్మోత్సవాలలో మొదటి రోజున 2024 సంవత్సరపు టీటీడీ క్యాలండర్లు, డైరీలను ముఖ్యమంత్రి వర్యులచే విడుదల చేస్తాం.

ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం శ్రీవాణి నిధులు

– హిందూ సనాతన ధర్మప్రచారంలో భాగంగా రాష్ట్రంలో టీటీడీ ఆర్థిక సహాయంతో నిర్మించిన 501 ఆలయాలకు ధూపదీప నైవేద్యాల కోసం ఆగస్టు నెలకు ఒక్కో ఆలయానికి రూ.5 వేలు చొప్పున 25 లక్షలా 5 వేల రూపాయలను శ్రీవాణి ట్రస్ట్‌ నిధుల ద్వారా విడుదల చేశాం.

కారీరిష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమం

– రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఆగస్టు 22 నుండి 26వ తేదీ వరకు కారీరిష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమాలు నిర్వహించాం. తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో వ‌ర్షాలు కురుస్తున్నాయి.

– లోకం క‌ల్యాణార్థం త్వ‌ర‌లో తిరుచానూరులో మ‌హా వ‌రుణ యాగం నిర్వ‌హిస్తాం.

భక్తుల లగేజి నిర్వహణ

– శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు తమ లగేజిని, మొబైల్‌ ఫోన్లను డిపాజిట్‌ చేసి తిరిగి తీసుకునే ప్రక్రియను వేగంగా, సులభంగా చేపట్టేందుకు డిజిటలైజేషన్‌, ఆటోమేషన్‌ ద్వారా నూతనంగా బాలాజి బ్యాగేజ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను అమలు చేస్తున్నాం.

– ప్రస్తుత విధానంలో లగేజి గానీ, మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను డిపాజిట్‌ చేస్తే ఎక్కువ సమయం వేచి ఉండకుండా సులభంగా తిరిగి పొందవచ్చు.

– ఈ నూతన విధానం 16 కేంద్రాల ద్వారా 44 కౌంటర్లలో ఒక నెల నుండి అమలవుతోంది. ప్రతిరోజు 60 వేల మొబైల్‌ ఫోన్లు, 40 వేలకు పైగా బ్యాగులను డిపాజిట్‌, డెలివరీ చేస్తున్నాం.

శిల్ప కళాశాలలో వర్క్‌షాప్‌

– ఈ నెల 4 నుండి 6వ తేదీ వరకు తిరుపతిలోని అలిపిరి వ‌ద్ద గ‌ల‌ శ్రీ వేంకటేశ్వర శిల్ప కళాశాలలో శిల్పాల తయారీ, ఆలయ నిర్మాణంపై వర్క్‌షాప్‌ జరుగనుంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి నిపుణులు విచ్చేసి మెళకువలను తెలియజేస్తారు.

– విద్యార్థులు తయారు చేసే వివిధ రకాల శిల్పాలు, పెయింటింగ్స్‌ భక్తులకు అందుబాటులో ఉంచుతాం.

నడక మార్గాలలో

– నడక మార్గాల్లో క్రూరమృగాల కదలికల నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా అటవీ శాఖవారి సూచనల మేరకు రెండు నడక మార్గాలలో మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 12 ఏళ్ళలోపు పిల్లలను అనుమతిస్తున్నాం. పెద్దలను రాత్రి 10 గంటల వరకు అనుమతిస్తున్నాం. అయితే ద్విచక్ర వాహనాల రాకపోకలు ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నాం. భ‌క్తుల విజ్ఞ‌ప్తి మేర‌కు అట‌వీ శాఖ అనుమ‌తితో త్వ‌ర‌లో ఈ నిబంధ‌న‌లు స‌డ‌లిస్తాం.

అవయవ దానంపై అవగాహన

– అవయవాలను ట్రాన్స్‌ ప్లాంట్‌ చేసే అత్యుత్తమ వ్యవస్థ స్విమ్స్‌లో ఉంది. మరణానికి దగ్గరగా ఉన్నవారు గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ వంటి అవయవాలను దానం చేస్తే అవసరమైన వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చు. అవయవదానంపై అందరూ అవగాహన పెంచుకుని ఇతరులకు తెలియజేయాలని కోరుతున్నాను.

– శ్రీ పద్మావతి హృదయాలయంలో ఇప్పటి వరకు 1822 మంది చిన్నరులకుగుండె శస్త్రచికిత్సలు, ఐదు గుండెమార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించడం జరిగింది.

– ఆయుర్వేద వైద్య ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎస్వీబిసిలో ‘‘ఆరోగ్య సోపానం’’ కార్యక్రమం (ప్రతి ఎపిసోడ్‌ 30 నిమిషాల) ప్రసారం చేస్తోంది. ఇందులో ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి మరియు కళాశాలకు చెందిన ఆయుర్వేద వైద్యులు పాల్గొంటున్నారు.

– తిరుపతి ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో ఆగస్టు 29న ఎపి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ కాలేజియేట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘మహా జాబ్‌ మేళా’’లో టీటీడీ డిగ్రీ కళాశాలలో చివరి సంవత్సరం పూర్తి చేసిన 230 మంది విద్యార్థులు వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు.

ఆగ‌స్టు నెలలో నమోదైన వివరాలు :

దర్శనం :

– శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ` 22.25 లక్షలు

హుండీ :

– హుండీ కానుకలు ` రూ.120.05 కోట్లు

లడ్డూలు :

– విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య ` 1 కోటి 9 లక్షలు

అన్నప్రసాదం :

– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య ` 43.07 లక్షలు

కల్యాణకట్ట :

– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య ` 9.07 లక్షలు

ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్వీ బీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ నాగేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.