DISCHARGE DUTIES WITH MORE COMMITMENT – ADDITIONAL EO TTD TTD EMPLOYEES _ భక్తి, నిబద్ధతతో విధులు నిర్వర్తించండి – బ్రహ్మోత్సవ సిబ్బందితో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి
Tirumala, 23 September 2025: The TTD Additional EO Sri Ch Venkaiah Chowdary called on all the deputation officers and employees for annual Brahmotsavams to discharge duties with more commitment.
During the orientation program held for deputed staff held at Astana Mandapam in Tirumala on Tuesday evening, the Additional EO advised the deputed staff to work in coordination with already working staff in the respective places and extend their support in executing the assigned activities in a smooth manner.
He said this year the annual brahmotsavams has been planned in a meticulous manner and besides SoPs, proper check lists have also been prepared to get proper feedback from devotees.
JEO Sri Veerabrahmam, CVSO Sri Muralikrishna, and other officers, deputed staff were also present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
భక్తి, నిబద్ధతతో విధులు నిర్వర్తించండి
బ్రహ్మోత్సవ సిబ్బందితో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి
తిరుమల, 2025 సెప్టెంబర్ 23: వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో విధులు నిర్వర్తించడానికి వచ్చిన డిప్యూటేషన్ అధికారులు, సిబ్బంది మరింత భక్తి, నిబద్ధతతో పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు.
మంగళవారం సాయంత్రం తిరుమల ఆస్థాన మండపంలో డిప్యూటేషన్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత ప్రాంతాల్లో ఇప్పటికే విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందితో సమన్వయం చేసుకుని, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కోరారు.
ఈసారి బ్రహ్మోత్సవాలను ఎంతో సమగ్రంగా ప్రణాళికాబద్ధంగా రూపొందించామని, నిర్ధిష్ట విధివిధానాలతో పాటు చెక్‌లిస్ట్‌లను కూడా సిద్ధం చేశామని, తద్వారా భక్తుల నుండి సరైన ఫీడ్‌బ్యాక్ పొందేందుకు వీలుకలుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఇతర అధికారులు, డిప్యూటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


