TTD TO DISPENSE WITH DD TOKENS DURING WEEK ENDS ON TRIAL BASIS_ జూలై 7 నుంచి ప్రయోగాత్మకంగా వారాంతంలో దివ్యదర్శనం టోకెన్ల రద్దు : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 28 June, 17: Owing to heavy pilgrim rush which has been continuing even after completion of summer holidays in Tirumala, TTD has decided to dispense with divya darshanam tokens during week ends from July 7 on trial basis.

Speaking to media persons in Tirumala on Wednesday Tirumala JEO Sri KS Sreenivasa Raju said this summer vacation has seen unprecedented pilgrim rush in Hill town. “Especially the pilgrims trekking footpath routes have touched 50thousands during many week ends. Earlier this used to be only on GarudaSeva or Vaikuntha Ekadasi but now during normal days also the figure is touching 35 thousands in footpath routes. So to facilitate better darshan to pilgrims we have decided to dispense divya darshan tokens from July 7 on Fridays, Saturdays and sundays. No decision has been taken on the free laddu issued to them”, he added.

Later he complimented all the departments for extending best services to pilgrims in their respective areas even during heavy rush.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 7 నుంచి ప్రయోగాత్మకంగా వారాంతంలో దివ్యదర్శనం టోకెన్ల రద్దు : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

తిరుమల, 2017, జూన్‌ 28: తిరుమలలో వేసవి సెలవుల అనంతరం కూడా రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించడంలో భాగంగా జూలై 7వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా వారాంతపు రోజులైన శుక్ర, శని, ఆదివారాల్లో దివ్యదర్శనం(కాలినడక) టోకెన్లు రద్దు చేస్తామని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు.

తిరుమలలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విశేష సంఖ్యలో విచ్చేసిన భక్తులకు టిటిడి అధికారులు, సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమించి చక్కటి సేవలందించారని తెలిపారు. ఇటీవల స్వామివారి దర్శనార్థం విచ్చేసే నడకదారి భక్తుల సంఖ్య బాగా పెరిగిందన్నారు. సాధారణంగా గరుడసేవ, వైకుంఠ ఏకాదశి లాంటి ముఖ్యమైన పర్వదినాల్లో మాత్రమే 50 వేల మందికిపైగా భక్తులు నడకదారిలో వస్తుంటారని, ఇటీవల సాధారణ రోజుల్లోనూ కాలినకడన అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారని చెప్పారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ రోజుల్లో రోజుకు 35 వేలకు పైగా కాలినడకన తిరుమలకు వస్తున్నారని, ఈ కారణంగా రద్దీ విపరీతంగా పెరుగుతోందని అన్నారు. ఈ క్రమంలో ప్రయోగాత్మకంగా జూలై 7 నుండి వారాంతంలో మూడు రోజుల పాటు దివ్యదర్శనం టోకెన్లు రద్దు చేస్తామని, కొన్ని రోజుల పాటు పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాలినడక భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టిటిడికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాలినడకన వస్తున్న భక్తులకు ఇస్తున్న ఉచిత లడ్డూపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.