DIVYAPRABANDHA MAHOTSAVAMA GOES TO VIZIANAGARAM_ ఫిబ్రవరి 18, 19వ తేదీల్లో విజయనగరంలో నాళాయిర దివ్యప్రబంధ పారాయణ మహోత్సవం

Tirupati, 16 February 2018: For the well being of society, the TTD plans to conduct the Divya Prandha Parayanam Mahotsavam at Vizianagaram on February 18 and 19.

The program held under the aegis of the Alwar Divya Prabandam project will be conducted by the Sri Srinivasa Seva Sangham at the Sri Kalyana Venkateswara Swamy temple.

The parayanadars will recite the 4000 pashuras composed by the Alwars in the presence of Sri Ramanujacharya. Devotional discourses by popular pundits and bhajans will also be conducted.

Besides the Srivari Temple, the TTD has been conducting parayanas of Nalayar Divya Prabandham in other Srivaishnavite temples across the country for imparting Vedic and cultural knowledge to the younger generation. Nearly 100 Divya prabandha teachers, 20 Veda Parayanadars will participate in the Mahotsavam under the supervision of Divya Prabandha project OSD Dr VG Chokkalingam.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI

ఫిబ్రవరి 18, 19వ తేదీల్లో విజయనగరంలో నాళాయిర దివ్యప్రబంధ పారాయణ మహోత్సవం

ఫిబ్రవరి 16, తిరుపతి, 2018: టిటిడి నాళాయిర దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో లోకకల్యాణం కోసం ఫిబ్రవరి 18, 19వ తేదీల్లో విజయనగరంలో నాళాయిర దివ్యప్రబంధ పారాయణ మహోత్సవం నిర్వహించనున్నారు.

విజయనగరంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గల శ్రీ శ్రీనివాస సేవా సంఘంలో ఈ ఉత్సవం జరుగనుంది. శ్రీరామానుజాచార్యుల ఉత్సవ విగ్రహం సమక్షంలో ఆళ్వార్లు రచించిన 4 వేల పాశురాలను ఈ సందర్భంగా దివ్యప్రబంధ పారాయణదారులు పారాయణం చేస్తారు. అదేవిధంగా, ప్రముఖ పండితులతో ఉపన్యాసాలు, భజనలు నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర వైష్ణవాలయాల్లో శ్రీరామానుజాచార్యులవారు నాళాయిర దివ్యప్రబంధ పారాయణాన్ని ఏర్పాటుచేశారు. ఇలాంటి దివ్యప్రబంధాన్ని భావితరాలకు వ్యాప్తి చేసేందుకు టిటిడి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ మహోత్సవంలో 100 మంది దివ్యప్రబంధ అధ్యాపకులు, 20 మంది వేదపారాయణదారులు పాల్గొంటారు. నాళాయిర దివ్య ప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా|| వి.జి.చొక్కలింగం ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.