SRIVARI DARSHAN AND ACCOMODATION TO DIGNITARIES AS PER PROTOCOL- TIRUMALA JEO_ ప్రోటోకాల్‌ ప్రముఖులకు నిబంధనల ప్రకారం శ్రీవారి దర్శనం, వసతి కల్పించాలి : జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirupati, 16 February 2018: The Tirumala JEO Sri KS Sreenivasa Raju today directed the officials to coordiante with all departments and ensure provision of accomodation and Srivari darshan to dignitaries as per protocol.

Addressing a review meeting at Annamaiah bhavan the JEO Sri Raju gave directions to officials on protocol regulations and arrangements to be followed for dignitaries like constitutional heads,Judges and administrators etc.

There should be no lapse in purchase of darshan tickets, and temple honors for the VVIPs under protocol regualtions, he cautioned.

Prominent among those who participated in the review meeting were DyEOs Sri Harindranath, Sri Balaji, Sri Venkataiah, Sri Damodaram, Smt Varalakshmi, CAO Sri Raviprasadu, OSD Sri Lakshminarayana Yadav and others.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ప్రోటోకాల్‌ ప్రముఖులకు నిబంధనల ప్రకారం శ్రీవారి దర్శనం, వసతి కల్పించాలి : జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

ఫిబ్రవరి 16, తిరుమల, 2018: తిరుమలకు వచ్చే ప్రోటోకాల్‌ ప్రముఖులకు నిబంధనల ప్రకారం శ్రీవారి దర్శనం, వసతి కల్పించాలని, ఆయా విభాగాల అధికారులు ఈ విషయంలో పూర్తి సమన్వయంతో పని చేయాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ రాజ్యాంగపరమైన కార్యనిర్వాహక, శాసన, న్యాయ విభాగాలకు చెందిన ముఖ్యమైన ప్రముఖులు తిరుమలకు వచ్చినపుడు చేపట్టాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ప్రోటోకాల్‌ ప్రముఖులకు నిర్దేశించిన విధివిధానాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. దర్శన టికెట్ల కొనుగోలు, ఆలయ మర్యాదలు విషయంలో నిబంధనలను అనుసరించాలని సూచించారు.

ఈ సమావేశంలో టిటిడి డెప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాథ్‌, శ్రీ బాలాజి, శ్రీ వెంకటయ్య, శ్రీ దామోదరం, శ్రీమతి వరలక్ష్మి, సిఏవో శ్రీ రవిప్రసాదు, ఓఎస్‌డి శ్రీ లక్ష్మీనారాయణ యాదవ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.