టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం

టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం

తిరుపతి, 15 అక్టోబర్ 2018: తిరుపతికి చెందిన శ్రీ కె.బాలిరెడ్డి, శ్రీ కె.కమలాకర్ రెడ్డి కలిసి టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు సోమవారం 10 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సెంట్రలైజ్డ్ డోనార్ మేనేజ్మెంట్ కార్యాలయంలో ఈ మేరకు విరాళం చెక్కును అందించారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.