GOLDEN KALASAMS DONATED TO PRASANNA VENKATESWARA SWAMY_ శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి 10 కలశాలు విరాళం

Appalayagunata, 1 September 2018: Two donors have donated 10 Gold malam Kalasams to Sri Prasanna Venkateswara Swamy on Saturday.

The family members of Anantapur MLC Sri Tippeswamy donated 5 gold malam Kalasams pricing around Rs.2lakhs which will be installed on the Rajagopuram of main temple.

While Sri Rami Reddy of Rayalaseema Educational Institutions donated another five gold covering Kalasams costing around Rs.2.20lakhs. Each Kalasa will be installed on Sri Padmavathi, Sri Andal, Sri Garudalwar and Sri Anjaneya Swamy shrines.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి 10 కలశాలు విరాళం

సెప్టెంబరు 01, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ అష్టబంధన జీర్ణోద్ధారణ మహాసంప్రోక్షణ సందర్భంగా శనివారం బంగారు పూత పూసిన 10 కలశాలను దాతలు విరాళంగా సమర్పించారు.

అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ శ్రీ జి.తిప్పేస్వామి కుటుంబ సభ్యులు రూ.2 లక్షలు విలువైన 5 బంగారు పూత పూసిన కలశాలను అందించారు. వీటిని ఆలయ రాజగోపురానికి ఏర్పాటుచేస్తారు. అదేవిధంగా, తిరుపతిలోని రామిరెడ్డి రాయలసీమ విద్యాసంస్థల అధినేత శ్రీమన్నెం రామిరెడ్డి రూ.2.20 లక్షలు విలువైన 5 బంగారు పూత పూసిన కలశాలను అందజేశారు. వీటిని స్వామివారి గర్భాలయానికి, శ్రీ పద్మావతి, శ్రీ ఆండాళ్‌, శ్రీ ఆంజనేయ, శ్రీ గరుడాళ్వార్‌ ఆలయాలకు అమర్చుతారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ గోపాలకృష్ణ, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.