2019 TTD CALENDARS AND DIARIES ON-LINE_ భక్తుల కోసం ఆన్‌లైన్‌లో 2019 టిటిడి డైరీలు, క్యాలెండర్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 1 September 2018: As soon as the 2019 TTD calendars and diaries get released during the ensuing brahmotsavams, they should be made available on online for the sake of devotees, instructed TTD EO Sri Anil Kumar Singhal.

Senior Officers review meeting was held in TTD administrative building in Tirupati on Saturday. The EO instructed the concerned to make available the brahmotsavams booklets in online. The EO also directed the officials concerned to find an alternative place to overcome the parking woes near Sri Govinda Raja Swamy temple.

The EO also instructed the the engineering officials to complete the construction of Rest House at Tiruchanoor and also the works at Vontimitta.

The EO directed the to keep counting machines to record the numbers of devotees visiting to all local temples under the umbrella of TTD.

He instructed to set up mythological themes to enhance devotion while erect illumination arches for ensuing brahmotsavams in Tirumala.

JEOs Sri KS Sreenivasa Raju, Sri P Bhaskar, CVSO In-charge Sri Siva Kumar Reddy, FACAO Sri Balaji, DLO Sri Ramana Naidu and others were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

భక్తుల కోసం ఆన్‌లైన్‌లో 2019 టిటిడి డైరీలు, క్యాలెండర్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2018 సెప్టెంబర్‌ 01: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 2019 సంవత్సరం టిటిడి డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన అనంతరం భక్తులు బుక్‌ చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో శనివారం ఆయన సీనియర్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గత ఏడాది తరహాలోనే ఈ సంవత్సరం కూడా టిటిడి డైరీలు, క్యాలెండర్లను భక్తులు బుక్‌ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా భక్తుల సౌలభ్యం కొరకు శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం నగర నడిబొడ్డున రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉండడం మూలంగా పార్కింగ్‌ సమస్య తీవ్రంగా ఉందని, ఇందుకోసం స్థలాన్ని అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. టిటిడి స్థానిక ఆలయాలకు ఎంతమంది భక్తులు వచ్చారో తెలుసుకునేందుకు వీలుగా కౌంటింగ్‌ మిషన్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. తిరుచానూరు శ్రీవద్మావతి అమ్మవారి ఆలయ సమీపంలో నిర్మాణంలో ఉన్న విశ్రాంతిగృహం పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి ఆలయం బయట నిర్మాణంలో ఉన్న పనులను అక్టోబర్‌లోపు పూర్తి చేయాలన్నారు.

తిరుమలలో మరింత భక్తిభావం పెంచేలా విద్యుత్‌ అలంకరణలు :

శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శాస్త్రీయ పద్ధతిలో భక్తిభావం ఉట్టిపడేలా, భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్‌ అలంకరణలు ఉండాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. శ్రీవారి సేవకుల కోసం నిర్మిస్తున్న సేవాసదన్‌ భవనంలో పెండింగ్‌లో ఉన్న పనులను బ్రహ్మోత్సవాలలోపు పూర్తి చేయాలన్నారు. టిటిడి ఆలయాలు, అనుబంధ ఆలయాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ఆలయాల వారీగా జరుగుతున్న పనులపై ఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌ శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్‌, ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎఫ్‌ఎ అండ్‌ సిఎవో శ్రీ బాలాజీ, డిఎల్‌వో శ్రీ ఎం.వి.రమణనాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.