DONATION OF MARUTI ERTIGA CAR TO TTD_ టిటిడికి మారుతి సుజుకీ కారు విరాళం

Tirumala, 12 February 2018: Sri Venkateswara Rao, Sri Durga Automotive, Anantapur has donated Maruthi Suzuki Ertiga VXI, vehicle model car worth about Rs. 10 lakhs to TTDs. The donation has been received by Temple DyEO Sri Haridranath on Monday morning in front of Tirumala Shrine.

Transport DI Sri Bhaskar Naidu and others were present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడికి మారుతి సుజుకీ కారు విరాళం

ఫిబ్రవరి 12, తిరుమల, 2018: టిటిడికి సోమవారం మారుతి సుజుకీ కారు విరాళంగా అందింది. అనంతపురానికి చెందిన శ్రీ దుర్గా ఆటోమోటివ్స్‌ అధినేత శ్రీ వేంకటేశ్వరరావు ఈ మేరకు రూ.10.33 లక్షల విలువైన కారును విరాళంగా అందించారు.

శ్రీవారి ఆలయం ఎదుట కారుకు పూజలు నిర్వహించిన అనంతరం తాళాలను ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా దాత శ్రీ వేంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ షోరూమ్‌ నుంచి ఒక కారును శ్రీవారికి కానుకగా అందిస్తున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ట్రాన్స్‌పోర్టు డ్రైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ శ్రీ భాస్కర్‌నాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.