SENIOR OFFICERS TEAM INSPECTS SEVA GRAMAM_ శ్రీవారి సేవా సదన్‌ నిర్మాణ పనుల పరిశీలన

Tirumala, 12 February 2018: A team of senior officers lead by FACAO Sri O Balaji inspected the ongoing construction works of new Srivari Seva building which is coming up at Rs.85cr near Kalyana Vedika in Tirumala on Monday.

The new “Seva Gramam” which has two exclusive buildings to accommodate women and men volunteers separately is nearing completion. Under the instructions of Tirumala JEO Sri KS Sreenivasa Raju, the senior officers team visited and inspected the entire building to vet the civil, electrical, water works.

The FACAO suggested the officials concerned to provide proper PA system for the two buildings. He also inspected the dining hall, reception room, satsang hall in the building and made necessary suggestions.

SE II Sri Ramachandra Reddy, DyEO Temple Sri Harindranath, DyEO Annaprasadam Sri Venugopal, Catering Officer Sri Sastry, GM Sri Sesha Reddy, VGO Ravindra Reddy, Garden Superintendent Sri Srinivasulu, SE Electrical Sri Venkateswarulu were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీవారి సేవా సదన్‌ నిర్మాణ పనుల పరిశీలన

ఫిబ్రవరి 12, తిరుమల, 2018: తిరుమలలో శ్రీవారి సేవకుల కోసం నిర్మిస్తున్న శ్రీవారి సేవా సదన్‌ భవనం మరో రెండు నెలల్లో పూర్తికానున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న సివిల్‌, ఎలక్ట్రికల్‌ పనులను టిటిడి ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి నేతృత్వంలో అధికారులు సోమవారం పరిశీలించారు. అక్కడ కల్పించాల్సిన సౌకర్యాలపై పలు సూచనలు చేశారు.

సుమారు రెండు గంటల పాటు పలు విభాగాల అధికారులు పనులను పరిశీలించారు. శ్రీవారి సేవకుల బస, శిక్షణ కోసం కావాల్సిన పరికరాలు, పిఏ సిస్టమ్‌, సెక్యూరిటీ పోస్టు, ఉద్యానవన ఏర్పాటు తదితర విషయాలపై అధికారులు చర్చించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ వేంకటేశ్వర్లు, విఎస్‌వో శ్రీ రవీంద్రారెడ్డి, ట్రాన్స్‌పోర్టు జనరల్‌ మేనేజర్‌ శ్రీ శేషారెడ్డి, శ్రీవారి సేవ విభాగాధిపతి, ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి, ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాసులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.