DONATION RECEIVED _ టీటీడీకి రూ.5.11 కోట్లు విరాళం

TIRUMALA, 07 AUGUST 2023: A donation amount of Rs. 5.11cr has been received by TTD and about nine donors led by LAC President of TN Sri Sekhar Reddy.

The donors handed over the DD for the same amount to the TTD Trust Board Chairman Sri YV Subba Reddy at Annamaiah Bhavan on Monday.

The amount has been contributed towards the proposed purchase of land for the expansion of the existing Sri Venkateswara Swamy temple in Venkatanarayana Road at T Nagar in Chennai. The TTD LAC has identified 5.5 grounds worth Rs.35cr land adjacent to this temple for expansion.

Earlier a few donors have already donated Rs. 8,15,15,002 towards the purchase of this proposed land.

Among the donors who contributed the amount on Monday includes Rs.1.50cr from Rapidcare Grp., Rs. 1cr each by Sri Venkata Subramanyam and Family, Sri Nagarajan and Family, CR constructions from Coimbatore, Rs. 20lakhs each by Sri Sreesaran, Sri Shenbagamurty, Rs. 10lakhs each by Sri Naresh Subrahmanyam, Sri Balaha Chemicals(P) Ltd, Rs.1lakh by Neeladri Packings.

TTD EO Sri AV Dharma Reddy, members of the Trust Board were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీకి రూ.5.11 కోట్లు విరాళం

తిరుమల, 2023, ఆగస్టు 07: చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు శ్రీ శేఖర్ రెడ్డి నేతృత్వంలో తొమ్మిది మంది దాతలు కలిసి టీటీడీకి రూ.5.11 కోట్లు విరాళం అందించారు. దాతలు ఈ మొత్తానికి సంబంధించిన డీడీని సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డికి అందజేశారు.

చెన్నై టి.నగర్‌లోని వెంకటనారాయణ రోడ్‌లో ప్రస్తుతం ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ కోసం స్థలం కొనుగోలుకు ఈ మొత్తాన్ని అందించారు. ఈ ఆలయానికి ఆనుకుని ఉన్న రూ.35 కోట్ల విలువైన 5.5 గ్రౌండ్ల స్థలాన్ని చెన్నై స్థానిక సలహామండలి గుర్తించింది. ఈ స్థలం కొనుగోలుకు గతంలో కొంతమంది దాతలు 8,15,15,002 రూపాయలను విరాళంగా అందించారు.

ప్రస్తుతం విరాళం అందించిన దాతలు ర్యాపిడ్‌కేర్ గ్రూపు రూ.1.50 కోట్లు, కోయంబత్తూరుకు చెందిన శ్రీ వెంకట సుబ్రహ్మణ్యం, శ్రీ నాగరాజన్, సిఆర్ కన్ స్ట్రాక్షన్స్ వారు ఒక్కొక్కరు కోటి రూపాయలు, శ్రీ శ్రీశరణ్, శ్రీ శెంబగమూర్తి ఒక్కొక్కరు 20 లక్షలు, శ్రీ నరేష్ సుబ్రహ్మణ్యం, శ్రీ బలహా కెమికల్స్(పి) లిమిటెడ్ వారు ఒక్కొక్కరు రూ. 10లక్షలు, నీలాద్రి ప్యాకింగ్స్ రూ.1లక్ష రూపాయలు విరాళంగా అందించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.