PROVIDING DARSHAN TO MORE COMMON PILGRIMS CHANGING VIP BREAK TIMINGS IS SATISFACTORY-TTD CHAIRMAN SRI YV SUBBA REDDY _ సామాన్యుల సేవే సంతృప్తినిచ్చింది – టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

TTD BOARD GIVES NOD TO SEVERAL DEVELOPMENT WORKS 

 

TIRUMALA, 07 AUGUST 2023: “Cancelling L1, L2, L3 categorisation and changing the VIP Break darshan timings to late morning hours, allowing common pilgrims to have darshan by reducing their waiting time in queues and compartments is the most satisfying decision in my four-year term as TTD Trust Board Chairman, said Sri YV Subba Reddy.

 

Sri YV Subba Reddy was appointed as TTD Chairman for two consecutive terms. In his four years tenure as TTD Chairman, several pilgrim-friendly initiatives and development works were taken up. 

 

 

During the media briefing held after the Board meeting at Annamaiah Bhavan, Sri Subba Reddy expressed that of the many historical decisions his board has taken during his tenure, providing hassle-free darshan to more number of pilgrims is what he considers the most satisfying decision. 

 

He thanked the TTD EO Sri AV Dharma Reddy, workforce of TTD for supporting his decisions and carrying them out in a successful manner to the satisfaction of the pilgrims. 

 

Later he also congratulated his successor and Tirupati Legislator Sri B Karunakar Reddy

Earlier he briefed on the important decisions taken by the board in its last meeting. Some excerpts : 

 

Rs.75.86cr worth advanced equipment for the Sri Padmavathi Children’s Heart Centre which is coming up in Tirupati adjacent to Ruia hospital 

 

Rs.24cr towards the construction of Protection Walls all along both the Ghat Roads to avoid  road accidents

 

Rs.23.50cr for constructing a Queue Complex for devotees in Tiruchanoor akin to Vaikuntham Queue complex in Tirumala

 

Rs.14.10cr towards the construction of an additional floor and Ground Floor in SV Ayurvedic Hospital and another Rs.3cr towards the construction of two more floors in the girls’ hostel in Ayurvedic College. 

 

Rs.11cr towards the construction of Boys Hostel for students of SV College of Music and Dance, SV Nadaswaram School Rs.9.85cr towards the development works of Vakulamata Temple with SRIVANI Trust funds

 

Rs.5cr towards various development works in SV Vedic Universityrs.4cr for laying shelters from Mokalimettu to Sri Lakshmi Narasimha Swamy temple footway

 

Rs.4.50cr for procuring advanced machinery in making Srivari Annaprasadams and another Rs. 4.25cr for setting up Ghee Plant in SV Gosala 

 

Rs.3.10cr development works in Srinivasa Mangapuram temple

 

Rs.3cr for constructing Subway(extension) near Srinivasam

 

Rs.2.50cr towards the development works in PAC1

 

Rs.2.20cr for establishing Electric buses Charging Station in Tirumala

 

Rs.2.20cr for constructing new TBCD Ward in Ruia hospital

 

Rs.1.65cr towards the development of Veshalamma and Tallpaka Pedda Gangamma temples in Tirupati

 

Rs.1.25cr towards laying fencing for the 69 TTD properties located at different places across the country which are identified as unprotected

 

26 more temples to be developed under SRIVANI Trust funds Rs.118.83cr to be released in the last phase after the completion of Srinivasa Setu works

 

The renowned and veteran Annamacharya Project artist, Dr Garimella Balakrishna Prasad has been given extension for three more years to serve as Asthana Vidhwan of TTD

 

Board members Sri Karunakar Reddy, Sri Ashok Kumar, Sro Madhusudhan Yadav, Sri Ramulu, Sri Rambhupal Reddy, TTD EO Sri AV Dharma Reddy, JEO Sri Veerabrahmam were also present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సామాన్యుల సేవే సంతృప్తినిచ్చింది – టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

తిరుమ‌ల‌, 2023 ఆగస్టు 07: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ముల ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షునిగా తాను ప‌నిచేసిన నాలుగేళ్ల‌లో ఎక్కువ‌మంది సామాన్య భ‌క్తుల‌కు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 టికెట్లు ర‌ద్దు చేయ‌డం, సామాన్యుల‌కు స్వామివారి తొలి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు విఐపి బ్రేక్ స‌మ‌యాన్ని మార్చుతూ తీసుకున్న నిర్ణ‌యాలు అత్యంత సంతృప్తినిచ్చాయ‌ని టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమ‌ల ద‌ర్శ‌నానికి వ‌చ్చే సామాన్య భ‌క్తులకు వ‌స‌తి, ఇత‌ర స‌దుపాయాలు మెరుగుప‌ర‌చ‌డం కోసం అనేక నిర్ణ‌యాలు తీసుకున్నామ‌ని, అయితే, ఈ రెండు నిర్ణ‌యాలు మాత్రం ఎప్ప‌టికీ మ‌రువ‌లేనివ‌ని తెలిపారు. నాలుగేళ్ల‌పాటు ఛైర్మ‌న్‌గా ప‌నిచేసే అదృష్టం ప్ర‌సాదించిన శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి, త‌నకు అవ‌కాశం ఇచ్చిన శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి, త‌న వెన్నంటి ఉన్న ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, ఇత‌ర అధికారులు, సిబ్బందికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. నూత‌న ఛైర్మ‌న్‌గా నియ‌మితులైన శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి అనుభ‌వం టీటీడీ అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఆయ‌న చెప్పారు. టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి చివ‌రి స‌మావేశం సోమ‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అధికారులు ఛైర్మ‌న్ నాలుగేళ్ల ప‌ద‌వీకాలంలో తీసుకున్న ముఖ్య‌మైన నిర్ణ‌యాలకు సంబంధించిన ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. అనంత‌రం శ్రీ వైవి.సుబ్బారెడ్డి మీడియాకు బోర్డు నిర్ణ‌యాల‌ను వెల్ల‌డించారు.

– 4 కోట్లతో అలిపిరి కాలిబాట మార్గంలోని మొదటి ఘాట్‌ రోడ్డులో మోకాలిమెట్టు నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం వరకు మిగిలి ఉన్న ప్రదేశంలో ఫుట్‌పాత్‌ షెల్టర్ల నిర్మాణం.

– 2.20 కోట్లతో తిరుమలలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డులో విద్యుత్‌ బస్సుల కోసం ఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు.

– 2.50 కోట్లతో తిరుమ‌ల‌లోని పిఏసి-1లో అభివృద్ధి పనులు.

– 24 కోట్లతో రెండు ఘాట్ రోడ్ల‌లో ర‌క్ష‌ణ గోడ‌ల నిర్మాణం.

– 4.50 కోట్లతో శ్రీవారి ప్రసాదాలు, అన్నప్రసాదం తయారీకి వినియోగించే వంట సరుకులను మరింత నాణ్యంగా పరిశోధించేందుకు వీలుగా అత్యాధునిక యంత్ర ప‌రిక‌రాలు కొనుగోలు.

– తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం చెంత భక్తులు వేచి ఉండేందుకు తిరుమ‌ల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ త‌ర‌హాలో 23.50 కోట్లతో యాత్రికుల వసతి భవనం నిర్మాణం.

– త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్న శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్ల‌ల సూప‌ర్‌స్పెషాలిటీ ఆసుప‌త్రికి అవ‌స‌ర‌మైన స్పెష‌లిస్టు డాక్ట‌ర్లు, డ్యూటీ డాక్ట‌ర్లు, స్టాఫ్‌న‌ర్సులు, ఇత‌ర పారామెడిక‌ల్ సిబ్బంది నియామ‌కానికి అనుమ‌తి. అదేవిధంగా 75.86 కోట్ల‌తో అత్యాధునిక‌ వైద్య‌ప‌రిక‌రాల కొనుగోలు.

– తిరుప‌తిలోని శ్రీ‌నివాసం కాంప్లెక్స్‌లో భ‌క్తుల స‌దుపాయం కోసం 3 కోట్ల‌తో స‌బ్‌వే నిర్మాణం.

– 3.10 కోట్లతో శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పార్కింగ్‌ వసతి, మినీ కల్యాణకట్ట, ఫెసిలిటీ సెంటర్‌ తదితర అభివృద్ధి పనులు.

– 9.85 కోట్ల శ్రీవాణి ట్రస్టు నిధులతో వకుళ మాత ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు సౌకర్యాల ఏర్పాటు.

– తిరుప‌తిలోని శ్రీ‌నివాస సేతుకు గాను చివ‌రి విడ‌త‌గా 118.83 కోట్లను ప‌నులు పూర్తికాగానే చెల్లించ‌డానికి ఆమోదం.

– తిరుప‌తిలోని ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యంలో అభివృద్ధి ప‌నుల‌కు 5 కోట్లు మంజూరు.

– తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో కైంక‌ర్యాల‌కు వినియోగించేందుకు ఎస్వీ గోసంర‌క్ష‌ణ‌శాల‌లో 4.25 కోట్లతో సంప్ర‌దాయ‌ప‌ద్ధ‌తిలో నెయ్యి త‌యారీ ప్లాంటు ఏర్పాటు.

– ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రిలో 11.50 కోట్లతో అదనపు అంత‌స్తు నిర్మాణం, 2.60 కోట్లతో గ్రౌండ్‌ ఫ్లోర్‌ అభివృద్ధి పనులు, 3 కోట్లతో ఆయుర్వేద‌ కళాశాల విద్యార్థినుల హాస్టల్‌ భవనంలో అదనంగా మరో రెండు అంతస్తుల నిర్మాణం.

– 2.20 కోట్లతో తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో నూతన టిబిసిడి వార్డు నిర్మాణం.

– 11 కోట్లతో ఎస్వీ సంగీత కళాశాల, మ‌రియు ఎస్వీ నాదస్వర పాఠశాలలో చదువుతున్న బాలురకు హాస్టల్‌ భవనం నిర్మాణం.

– 1.65 కోట్ల శ్రీ‌వాణి నిధుల‌తో తిరుపతిలోని పల్లెవీధిలో వెలసి ఉన్న వేశాలమ్మ ఆలయ అభివృద్ధి మరియు శ్రీ తాళ్ళపాక పెద్ద గంగమ్మ ఆలయ పున‌ర్నిర్మాణం.

– 1.25 కోట్లతో దేశవ్యాప్తంగా ఉన్న రక్షణ లేని 69 టీటీడీ భూములకు కంచె నిర్మాణం.

– టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా శ్రీ గ‌రిమెళ్ల బాల‌కృష్ణ‌ప్ర‌సాద్‌ను మ‌రో మూడేళ్ల పాటు నియామ‌కం.

– తెలుగు రాష్ట్రాల్లో శ్రీ‌వాణి నిధుల‌తో 26 ఆల‌యాల అభివృద్ధి.

మీడియా స‌మావేశంలో తిరుప‌తి శాస‌న‌స‌భ్యులు, టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, శ్రీ పోక‌ల అశోక్‌కుమార్‌, శ్రీ బుర్రా మ‌ధుసూద‌న్ యాద‌వ్‌, శ్రీ మూరంశెట్టి రాములు, శ్రీ కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.