DONATIONS OF Rs 33 LAKHS FOR ONE DAY ANNA PRASADAM _ రూ.33 లక్షల విరాళంతో ఒకరోజు అన్నప్రసాద వితరణకు అవకాశం
Tirumala, 08 January 2022: With an aim to provide qualitative and quantitative hygienic food to the multitude of visiting devotees, TTD has commenced a one-day scheme under Sri Venkateswara Anna Prasadam Trust a few years ago.
The one-day component includes full-day contributions at Rs.33lakhs, a day’s breakfast at ₹7.70 lakhs, lunch at ₹12.65 lakhs, and dinner at ₹12.65 lakhs. The name of the donor is also displayed at the MTVAC with added option to donors serving the Prasadam to devotees for day.
Presently Anna Prasadam is being distributed at MTVAC, old Annaprasadam in PAC 4, PAC 2 Vaikunta Queue Complex 1 & 2 compartments, outside queue lines, near Gali Gopuram on footpath, Srinivasam & Vishnu Nivasam complex, Ruia hospital, Maternity hospital, BIRRD, SV Ayurveda hospitals, 2&3 choultries, Tiruchanoor Anna Prasadam Bhavan.
Additionally, Prasadam is distributed at food counters in Tirumala, waiting complex of senior citizens, challenged persons,₹300 entry Darshan complex, main Kalyan katta where coffee, tea and milk for children are also provided.
PRASADAM FOR THREE LAKH ON FESTIVAL DAYS…
TTD organised Prasadam for over three lakh persons on important festivals like New year January 1, Vaikunta Ekadasi, Ratha Sapthami, and Garuda Vahana Seva day during annual Brahmotsavam.
AT VENGAMAMBA BHAVAN…
At MTVAC, morning breakfast of Upma, Pongal, Semia Upma in the morning from 9am and 10.30am, Lunch comprising Chakkara Pongili, Chutney, Rice, Sambar and butter milk is served between 10.30 am and 4pm, again between 5 pm and 10.30 pm.
For preparation of Anna Prasadam daily 14 to16.5 tonnes of rice, 6.5-7.5 tons of vegetables are utilised.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
రూ.33 లక్షల విరాళంతో ఒకరోజు అన్నప్రసాద వితరణకు అవకాశం
– దాతలు స్వయంగా వడ్డించవచ్చు
– దాతల పేరు ప్రదర్శన
తిరుమల, 2023 జనవరి 08: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒకరోజు విరాళ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ కోసం రూ.33 లక్షలు విరాళం ఇవ్వాల్సి ఉంటుంది.
ఉదయం అల్పాహారం కోసం రూ. 7.70 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.12.65 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.12.65 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు.
విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. అదేవిధంగా దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందొచ్చు.
తిరుమలలో ప్రస్తుతం అన్నప్రసాద విభాగం సేవలు అందుతున్న ప్రాంతాలు
ప్రస్తుతం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1, 2లోని కంపార్ట్‌మెంట్లు, బయటి క్యూలైన్‌లు, పీఏసీ-4( పాత అన్న ప్రసాదం ), పీఏసీ-2, అలిపిరి నడక మార్గంలోని గాలిగోపురం వద్ద, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, రుయా ఆసుపత్రి, స్విమ్స్, మెటర్నిటీ ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, 2వ సత్రం, 3వ సత్రం, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది.
తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలో అన్నప్రసాదాలు అందిస్తున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, 2లోని కంపార్ట్‌మెంట్లు, వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే కాంప్లెక్స్, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్, ప్రధాన కల్యాణకట్టలో టీ, కాఫీ, చంటిపిల్లలకు పాలు అందిస్తున్నారు.
ప్రముఖ దినాల్లో 3 లక్షల మందికి పైగా..
తిరుమలలో జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి పర్వదినాలు, బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజున 3లక్షల మందికి పైగా భక్తులకు టిటిడి అన్నప్రసాదాలు పంపిణీ చేస్తోంది.
వెంగమాంబ అన్నప్రసాద భవనం..
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు చట్నితో కలిపి ఉప్మా, పొంగళి, సేమ్యా ఉప్మా అందిస్తారు. ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10.30 గంటల వరకు చక్కెర పొంగలి, చట్ని, అన్నం, సాంబారు, రసం, మజ్జిగతో భక్తులకు వడ్డిస్తున్నారు. తిరుమలలో అన్నప్రసాదాల తయారీకి రోజుకు 14 నుంచి 16.5 టన్నుల బియ్యం, 6.5 నుంచి 7.5 టన్నుల కూరగాయలు వినియోగిస్తున్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.