DONATIONS POUR IN FOR TTD _ ఎస్వీ అన్న‌ప్ర‌సాదానికి రూ.1.75 కోట్లు విరాళం

Tirumala, 13 Dec. 19: Along with the increase in day by day pilgrim crowd thronging Tirumala and with the spread of Sri Venkateswara Bhakti cult across the globe, the donations are pouring in for the various trusts of TTD.

On Friday itself donations to the tune of 1.75crores have been poured in for Sri Venkateswara Annaprasadam Trust of TTD. All the donors have handed over the DDs of the respective donations to TTD Additional EO Sri AV Dharma Reddy at Annamaiah Bhavan in Tirumala on Friday.

Speaking on this occasion, the Addnl.EO said, it is in fact a kind gesture from the donors who have been contributing to the Annaprasadam Trust of TTD with a noble intention to do their bit to the massive Annaprasadam programme that is being carried out by TTD every day in Tirumala where in nearly one lakh pilgrims have free Annaprasadam.

Among the donors who did the largesse, a NRI devotee from America, Sri S Venkat has donated Rs.1,05,06,500 (Rupees one crore five lakhs six thousand and five hundreds) to Annaprasadam Trust of TTD while Sri Sanjay Goyal, CMD of Nectar Life Sciences, Pharmaceutical company from Chandigarh has donated Rs.51lakhs and Sri Gummadi Venkateswara Rao, the President of AP Rice Millers Association has contributed Rs.10lakhs for the Trust.

Apart from these donations, the Additional EO has said, that a devotee of Lord Venkateswara, who does not want to reveal his identity has given his consent to donate the amount towards the Melchat Vastrams for three years, which is estimated as approximately Rs.1.20crores.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

ఎస్వీ అన్న‌ప్ర‌సాదానికి రూ.1.75 కోట్లు విరాళం

తిరుమ‌ల‌, 2019 డిసెంబ‌రు 13: టిటిడి శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు శుక్రవారం రూ. 1.75 కోట్ల రూపాయలను దాత‌లు  విరాళంగా అందించారు. తిరుమలలోని అన్న‌మయ్య భవనంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎ.వి. ధర్మారెడ్డికి దాతలు విరాళాల డిడిలను అందజేశారు.
 
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ టిటిడి అన్నప్రసాదం ట్రస్టు ద్వారా ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు అందించేందుకు సహకరిస్తున్న దాతల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. దాత‌లు అన్నప్రసాదం కార్యక్రమానికి తమ వంతు కృషి చేయాలనే గొప్ప ఉద్దేశ్యంతో విరాళాలు అందివ్వ‌డం  ద్వారా  ప్రతి రోజు దాదాపు లక్ష మందికి పైగా యాత్రికులకు టిటిడి ఉచిత అన్నప్రసాదం అందిస్తున్న‌ట్లు తెలిపారు.

అమెరికాకు చెందిన ప్ర‌వాస భార‌తీయ‌ భక్తుడు శ్రీ ఎస్.వెంకట్ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ .1,05,06,500 (రూపాయల కోటి ఐదు లక్షల ఆరువేల ఐదు వందలు) విరాళంగా ఇవ్వగా, చండీఘ‌డ్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ సంస్థ నెక్టార్ లైఫ్ సైన్సెస్ సిఎండి శ్రీ సంజయ్ గోయల్ రూ .51 లక్షలు, ఎపి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు రూ .10 లక్షలు అందించారు.

ఈ విరాళాలతో పాటు, అజ్ఞాత భ‌క్తుడు శ్రీ‌వారికి మూడు సంవ‌త్స‌రాలకు స‌రిప‌డే మెల్‌చాట్ వస్త్రాల కోసం సుమారు రూ .1.20 కోట్లు  విరాళంగా ఇవ్వనున్న‌ట్లు అదనపు ఈవో తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.