ADDITIONAL EO INSPECTS ALL REST HOUSES _ తిరుమలలోని అతిథి గృహాలు, పిఏసిల‌ను త‌ణిఖీ చేసిన అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 13 Dec. 19: As a part of his everyday inspection in Tirumala, the Additional EO Sri AV Dharma Reddy on Friday evening inspected PAC 1, 2, 3, 5 and GNC, ANC, SNC, VVRH rest houses.

He interacted with pilgrims at every point and received feed back from them. Later speaking to media persons, the Additional EO said, the maintenance at all rest houses and PACs are appreciated by pilgrims apart from other amenities. 

However, the pavements need to be beautified and the furniture at VVRH needs to be replaced. The entire transformation of rest houses with best possible amenities will happen in a span of next five or six months, he added.

SE2 Sri Nageswara Rao, DyEO Reception Sri Balaji, EE FMS Sri Mallikarjuna Prasad, Health Officer Dr RR Reddy, DyEO KKC Smt Nagaratna, DE Smt Saraswathi, AEO Sri Mohan Raju and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

 

 

inspections15

తిరుమలలోని అతిథి గృహాలు, పిఏసిల‌ను త‌ణిఖీ చేసిన అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

డిసెంబరు 13, తిరుమ‌ల‌, 2019: తిరుమలలోని వివిధ ప్రాంతాల‌లో ఉన్న అతిథి గృహాలు, పిఏసిల‌ను టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి శుక్ర‌వారం సాయంత్రం త‌ణిఖీ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ టిటిడి  అతిథి గృహాల నిర్వ‌హ‌ణ బాగుంద‌న్నారు.  వివిఆర్‌సిలో ఫ‌ర్నిచ‌ర్ మార్చ‌ల‌ని, ఇత‌ర ప్రాంతాల‌లో మ‌రుగుదొడ్లు, పారిశుద్ధ్యం మ‌రింత మెరుగ్గా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత అదికారుల‌ను ఆదేశించారు.  
       
అంత‌కుముందు ఏఎన్‌సి, జిఎన్‌సి, ఎస్ఎమ్‌సి, వివిఆర్‌సి అతిథి గృహాలు, పిఏసి – 1, 2, 3 మ‌రియు 5ల‌ను అధికారుల‌తో క‌లిసి త‌ణిఖీ చేశారు. అయా అతిథి గృహాల వ‌ద్ద టిటిడి అందిస్తున్న సౌక‌ర్యాల‌పై భ‌క్తుల అభిప్రాయాల‌ను ఆయ‌న‌ అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవోతో ప‌లువురు భ‌క్తులు టిటిడి సేవ‌ల‌పై సంతృప్తి వ్య‌క్తం చేశారు.

ఇందులో భాగంగా పిఏసి -2లో మ‌హారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన శ్రీ నారాయ‌ణ చెవులూర్ అనే భ‌క్తుడు టిటిడి అందిస్తున్న సౌక‌ర్యాలు బాగున్నాయ‌న్నారు. అదేవిధంగా పిఏసి-3లో హైద‌రాబాద్‌కు చెందిన శ్రీ విజ‌య్‌కుమార్ అనే భ‌క్తుడు శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి దాదాపు 5 నుండి 6 గంట‌లు ప‌డుతుంద‌ని, త్వ‌ర‌త గ‌తిన ద‌ర్శ‌నం అయ్యేలా చూడాల‌ని, మిగ‌త సౌక‌ర్యాలు చాలా బాగున్నాయ‌న్నారు.  
     
ఈ కార్య‌క్ర‌మంలో ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వ‌ర‌రావు, డెప్యూటీ ఈవో ఆర్‌-1 శ్రీ బాలాజి, ఎఫ్‌.ఎమ్‌.ఎస్‌. ఇఇ శ్రీ మ‌ల్లికార్జున ప్ర‌సాద్‌, డిఇ శ్రీ‌మ‌తి స‌ర‌స్వ‌తి, ఏఈవో శ్రీ మోహ‌న్ రాజు, ఇత‌ర అధికారులు పాల్గొన్నార.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.