DONOR SUPPORT FOR ARTIFICIAL LIMBS TO BIRRD PATIENTS _ దాత‌ల స‌హ‌కారంతో బ‌ర్డ్‌లో రోగుల‌కు కృత్రిమ అవ‌య‌వాల పంపిణీ

Tirupati, 08, June 2024:  Distribution of artificial limbs to 110 challenged patients of BIRRD was conducted on Saturday with the support of Sri Subramanian, the donor from Tamil Nadu who gave ₹ q crore towards the modernisation of the artificial limbs production centre at  BIRRD hospital.
 
The artificial limbs manufactured by the Endolite company with technical support from the UK were freely given to patients through by TTD following the company’s offer of the aluminium-made equipment at a 50% subsidy.
 
Patients said these equipments provided easy to use and were more comfortable than the Jaipur model. 
 
Doctors from BIRRD hospital, medical staff and patients with their relatives were present.
 
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

దాత‌ల స‌హ‌కారంతో బ‌ర్డ్‌లో రోగుల‌కు కృత్రిమ అవ‌య‌వాల పంపిణీ

తిరుపతి, 08 జూన్ 2024: బర్డ్ ఆసుపత్రిలో 110 మంది దివ్యాంగుల‌కు కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ఇటీవల త‌మిళ‌నాడు ధ‌ర్మ‌పురికి చెందిన‌ దాత శ్రీ సుబ్ర‌మ‌ణియ‌న్ బ‌ర్డ్ ఆసుపత్రిలో కృత్రిమ అవయవాల తయారీ కేంద్రం ఆధునీక‌ర‌ణ‌కు రూ.కోటి విరాళంగా అందించిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా యూకే సాంకేతిక సహకారంతో ఎండోలైట్ కంపెనీ వారు అత్యాధునిక సాంకేతిక స‌హ‌కారంతో త‌యారు చేసిన ఎక్కువ మన్నిక గల కృత్రిమ అవయవాలను ఉచితంగా అందించారు. బర్డ్ ఆసుపత్రి చేస్తున్న సేవలకు గానుఎండోలైట్ కంపెనీ వారు అస‌లు ధ‌ర‌లో 50 శాతం రాయితీతో అల్యూమినియంతో తయారు చేసిన ఈ కృత్రిమ అవయవాలను టీటీడీకి అందించారు.

వీటిని ధరించిన రోగులు సాధారణ వ్య‌క్తుల్లాగే అత్యంత సులభంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవగలుగుతున్నారు. ఇదివరకు తాము జైపూర్, ఇతర ప్రాంతాల్లో త‌యారైన‌ కృత్రిమ అవయవాలను ఉపయోగించామ‌ని, వాటికంటే కూడా ఈ అవయవాలు సౌకర్యవంతంగా ఉన్నాయని రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బర్డ్ ఆసుపత్రి డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, రోగుల బంధువులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.