DON’T BELIEVE FAKE VIDEOS IN SOCIAL MEDIA-EO _ – సామాజిక మాధ్యమాల దుష్ప్రచారాన్ని నమ్మకండి

TIRUMALA, 19 NOVEMBER 2021: TTD EO Dr KS Jawahar Reddy appealed to the pilgrims not to believe in fake reports and videos which are making rounds on Tirumala since Thursday.

The EO inspected the ongoing restoration works at Second Ghat road on Friday.

Later talking to the media he said, due to unprecedented rains boulders and hill rocks had fallen at different points in both first and second ghats. “As a safety measure, we have closed both ghats on Thursday evening. The restoration works were completed on Down Ghat and we allowed pilgrims to and fro movements on the same ghat.

As the repair works are still under way in upghat road, we are assessing the situation. Once the boulders are cleared, we will open the road. But some miscreants are creating unnecessary panicky among pilgrims by posting wrong videos. We have taken all safety measures for devotees who were stranded both at Tirupati and also in Tirumala.

He also inspected GNC at Tirumala, Narayanagiri Rest House, Akkagarla temple, Kapileswara Temple in Tirupati and made some important instructions.

JEO Sri Veerabrahmam, CE Sri Nageswara Rao, SE2 Sri Jagadeeshwar Reddy, Deputy EO Sri Subramaniam were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమల, తిరుపతిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు

– సామాజిక మాధ్యమాల దుష్ప్రచారాన్ని నమ్మకండి

– రెండో ఘాట్ రోడ్డును పరిశీలించిన టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్. జవహర్ రెడ్డి

తిరుమ‌ల‌, 2021 నవంబరు 19: భారీ వర్షం కారణంగా శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులకు తిరుమల, తిరుపతిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస, అన్నప్రసాదాలు తదితర ఏర్పాట్లు చేపట్టామని టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో జరుగుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ కొందరు పనిగట్టుకొని ఇతర ప్రాంతాలలో తీసిన వీడియోలు, ఫొటోలను తిరుమలలో తీసినట్టుగా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసి భయాందోళనకు గురి చేస్తున్నారని, భక్తులు వీటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. వర్షం కారణంగా గురువారం రెండు ఘాట్ రోడ్లలో దాదాపు పది ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని తెలిపారు. గురువారం రాత్రి రెండు ఘాట్ రోడ్లను మూసివేశామన్నారు. తిరుమల నుంచి తిరుపతికి చేరుకునే మొదటి ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలను తొలగించి శుక్రవారం ఉదయం రాకపోకలను పునరుద్ధరించినట్లు తెలిపారు. తిరుమల నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి తిరుమలకు ఈ మార్గంలోనే వాహనాలను అనుమతిస్తున్నట్లు వివరించారు. వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మార్గంలో రాకపోకలపై ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని మీడియా ద్వారా భక్తులకు తెలియజేస్తామన్నారు.

రెండో ఘాట్ రోడ్డులో కొండచరియల తొలగింపు పనులు పూర్తయ్యాయని, రోడ్డును శుభ్రం చేసిన అనంతరం భక్తులను అనుమతిస్తున్నామని చెప్పారు.

తిరుమలలో ఉన్న భక్తులు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, వర్షం తగ్గినంత వరకు గదుల్లోనే ఉండాలని, అందరికీ అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. తిరుపతిలో ఉండిపోయిన భక్తులు శ్రీనివాసం, పద్మావతి నిలయం, గోవిందరాజ స్వామి సత్రాలకు వెళ్లి బస పొందవచ్చని, అక్కడ భోజన వసతి కూడా కల్పించామని తెలిపారు. దర్శన టికెట్లు బుక్ చేసుకుని వర్షం కారణంగా తిరుమలకు రాలేని భక్తులకు మరోసారి శ్రీవారి దర్శన సౌకర్యం కల్పిస్తామన్నారు.

అంతకు ముందు ఆయన తిరుమల జిఎన్ సి, నారాయణ గిరి గెస్ట్ హౌస్, మొదటి ఘాట్ రోడ్డులోని అక్కగార్ల గుడి ప్రాంతాలను పరిశీలించారు. ఆ తరువాత తిరుపతిలోని శ్రీ కపీలేశ్వరస్వామి ఆలయాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈఓ వెంట జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఈ 2 శ్రీ జగదీశ్వర రెడ్డి, డిప్యూటి ఈవో శ్రీ సుబ్రమణ్యం తదితరులు ఉన్నారు.

టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారిచే విడుద‌ల చేయ‌బ‌డిన‌ది.