JEO (H AND E) INSPECTS BALAMANDIR AND SRAVANAM _ ఎస్వీ బాలమందిరం, శ్రవణం ప్రాజెక్టును పరిశీలించిన జెఈఓ

TIRUPATI, 19 NOVEMBER 2021: The JEO for Health and Education Smt Sada Bhargavi on Friday inspected SV Balamandir and Sravanam Projects along with CE Sri Nageswara Rao and others.

 

She instructed the Forest Wing officials to remove the fallen trees in the Sravanam premises.

 

She also directed the concerned to provide lockers, mats, bedsheets to the inmates and their parents and also instructed to change the food menu in consultation with the Dietician at SVIMS. 

 

She also inspected the kitchen at SV Balamandir and instructed the concerned to renovate the area and aslo arrest the leakages in some rooms.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ బాలమందిరం, శ్రవణం ప్రాజెక్టును పరిశీలించిన జెఈఓ

తిరుపతి, 2021, న‌వంబ‌రు 19: టిటిడి ఆధ్వర్యంలోని ఎస్వీ బాలమందిరం, శ్రవణం ప్రాజెక్టులో జెఈఓ శ్రీమతి సదాభార్గవి శుక్రవారం చీఫ్ ఇంజినీర్ శ్రీ డి.నాగేశ్వర రావు ఇతర అధికారులతో కలసి తనిఖీలు నిర్వహించారు.

భారీ వర్షాల నేపథ్యంలో శ్రవణంలోని పిల్లలు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని జెఈఓ శ్రీమతి సదా భార్గవి అధికారులకు సూచించారు. దుప్పట్లు, లాకర్స్, ఫ్లోర్ మాట్స్ అందుబాటులో ఉంచాలన్నారు. భోజనం మెను మార్చవలసినదిగా పిల్లల తల్లిదండ్రులు కోరగా స్విమ్స్ లోని డైటీషియన్ ను సంప్రదించి వారి సూచనల ప్రకారం మంచి పౌష్టికాహారం అందించాలని ఆమె అధికారులను ఆదేశించారు. శ్రవణంలో విరిగిపడిన వృక్షాలను తక్షణమే తొలగించాలని ఫారెస్ట్ అధికారులకు అదేశాలు జారీ చేశారు.

అనంతరం ఎస్వీ బాలమందిరాన్ని పరిశీలించారు. వంటశాలను ఆధునీకరించాలని, విద్యార్థులు ఉంటున్న కొన్ని రూములలో లీకేజీలను నియంత్రించాలని, బాల బాలికలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.