DURGA LAKSHMI SARASWATI HOMAM HELD _ కపిలతీర్థంలో ఆగమోక్తంగా శ్రీ దుర్గా, లక్ష్మీ, సరస్వతి హోమం
Tirupati, 20 January 2023 : As part of ongoing Homams at Sri Kapileswara Swamy temple in Tirupati on Friday, Sri Durga, Lakshmi, Saraswati Homam was held.
Temple DyEO Sri Devendra Babu, AEO Sri Parthasarathy, Temple Archakas and officials were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కపిలతీర్థంలో ఆగమోక్తంగా శ్రీ దుర్గా, లక్ష్మీ, సరస్వతి హోమం
తిరుపతి, 2023 జనవరి 20: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ దుర్గా, లక్ష్మీ, సరస్వతి హోమం ఆగమోక్తంగా జరిగింది.
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ట, శ్రీ దుర్గా, లక్ష్మీ, సరస్వతి హోమం, పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు.
జనవరి 21న శ్రీ రుద్ర, మహామృత్యుంజయ హోమంతో ఈ హోమాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈవో శ్రీ పార్థసారథి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.