DyCM COMPLIMENTS THE SOCIO-RELIGIOUS ACTIVITIES OF TTD_ భక్తులకు టిటిడి అందిస్తున్న సేవలు బాగున్నాయి : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు గౌ|| శ్రీ కె.ఇ .క్రిష్ణమూర్తి

Tirupati, 10 April 2018: The Deputy Chief Minister of Andhra Pradesh Sri KE Krishnamurthi complimented TTD for its various pilgrim initiatives and socio-religious services.

During his maiden review meeting in SPRH in Tirupati on Tuesday in the capacity of AP Endowments and Revenue Minister, he discussed in detail with TTD EO Sri Anil Kumar Singhal and other HoDs on various developmental activities taken up by TTD in providing facilities to Pilgrims in terms of darshan, accommodation, anna prasadam etc. in Tirumala.

The DyCM also discussed in length about the various charity activities taken by TTD by introducing various trusts and schemes, education institutions and specialised hospitals run by TTD, Veda Pathashalas etc.

EO has explained in detail about all the activities that are being executed by TTD along with his deputies Sri Srinivasa Raju and P Bhaskar. The EO also explained the DyCM about the construction works of various temples, bhajana mandirams taken up by TTD in SC, ST agency areas and also in big cities including those coming up in Kurukshetra, Kanya kumari, Bhubaneswar, Kolkata, Chennai etc.

About the medical facilities, the EO briefed the DyCM about the services of SVIMS, BIRRD hospitals, the upcoming Aravind Eye Care and TATA Cancer hospitals. The EO explained that many philanthropists are coming forward to fund TTD trusts and schemes and the temple management is giving wide publicity for its charitable activities also.

The DyCM also learnt from the Executive Officer about the running of special institutions like SV College of Music and Dance, Deaf and Dumb school, Veda Pathashalas by TTD. The EO said, the students who undergo vedic education will be paid stipend of Rs.3lakhs and Rs.1lakh on the completion of their 12 year and 8 year course respectively. EO also explained on how TTD trains up fishermen community, SC, STs in priesthood.

Later the EO sought the DyCM, as there is no recruitment for so long, many posts are lying vacant due staff crunch in TTD. The EO requested the DyCM and Endowments Minister that TTD has already sent a detailed proposal about the vacancies in various departments to the Government. “We are facing dearth of hands in many of our departments. Especially there is an urgent need of religious staff to carry out the temple rituals, festivities with more efficiency”, he maintained.

Reacting to the request of TTD EO, the DyCM said, the government is always ready to extend its support and said he will hold another review meeting on TTD in next couple of months along with Endowments Principal Secretary. The DyCM also appreciated the Annparasadam activities of TTD.

CEO In-Charge SVBC and Special Officer All Projects Sri N Muktheswara Rao, CE Sri Chandrasekhar Reddy, FACAO Sri O Balaji, Additional CVSO Sri Siva Kumar Reddy and other officers were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

భక్తులకు టిటిడి అందిస్తున్న సేవలు బాగున్నాయి : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు గౌ|| శ్రీ కె.ఇ .క్రిష్ణమూర్తి

తిరుపతి, 2018 ఏప్రిల్‌ 10: ప్రపంచ ప్రఖ్యాత దార్మికసంస్థ అయిన టిటిడి చేపట్టిన ధార్మిక, సామాజిక కార్యక్రమాలు, అదేవిధంగా తిరుమల, తిరుపతిలో భక్తులకు అందిస్తున్న సేవలు చాల బాగున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌ|| శ్రీ కె.ఇ.క్రిష్ణమూర్తి ఉద్ఘాటించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథిగృహంలో మంగళవారం ఆయన టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్‌, టిటిడిలోని అన్ని విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గౌ|| ఉప ముఖ్యమంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ తాను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా భాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా టిటిడి అధికారులతో సమావేశం నిర్వహించినట్ల్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రపంచం నలుమూలల నుండి లక్షలాదిగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం టిటిడి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. న భేషుగా ఉన్నాయన్నారు. అదేవిధంగా టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ఇతర సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. టిటిడిలో అన్యమత ప్రచారం జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నట్లు తెలియజేశారు.

తిరుమల, తిరుపతిలో భక్తులకు టిటిడి అందిస్తున్న అన్నప్రసాదాల పంపిణీ బాగుందని, ఇందులో వడ్డించే ప్రసాదాలు రుచికరంగా ఉన్నాయని తెలిపారు. తిరుమలకు విచ్చేసే భక్తులకు వసతి కల్పనలో టిటిడి తీసుకుంటున్న చర్యలు బాగున్నాయన్నారు.

అదేవిధంగా భక్తులకు మరింత సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనాన్ని కల్పించేందుకు త్వరలో ప్రారంభించనున్న సర్వదర్శనం టైంస్లాట్‌ విధానంపై టిటిడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రూ.300- ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్యదర్శనం భక్తులకు నిర్ణీత కాల వ్యవధిలో శ్రీవారి దర్శనం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. వేసవి శెలవు కారణంగా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకోనున్నారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు.

అంతకుముందు టిటిడిలోని కీలక విభాగాలలో నియమకాలు చేపట్టవలసిన అవసరమును ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, గౌ|| మంత్రివర్యులకు వివరించారు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులలో స్వామివారి నిత్యకైంకర్యాలను నిర్వహించే అర్చకులను నియమించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా టిటిడి ఆర్థిక సహాయం అందిస్తున్న స్విమ్స్‌, బర్డ్‌ ఆసుపత్రులు రోగులకు అందిస్తున్న సేవలను, అదేవిధంగా తిరుపతిలోని అలిపిరి మార్గంలో నిర్మాణంలో ఉన్న అరవిందో నేత్ర వైద్యాశాల, టాటా కేన్సర్‌ అసుపత్రి గురించి తెలిపారు.

ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టు ద్వారా టిటిడి చేపడుతున్న వేద పరిరక్షణ కార్యక్రమాలు, తిరుమలలోని వేద పాఠశాల, కీసరగుట్ట, ఐ.బీమవరం తదితర ప్రాంతాలలో దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులకు బోదిస్తున్నట్లు వివరించారు. వేద విద్యార్థులు 12 సంవత్సరాలు వేదం, 8 సంవత్సరాలు ఆగమ విద్యాభ్యాసం పూర్తయిన అనంతరం వారికి అవసరమైన సహకారం అందిస్తున్నట్లు వివరించారు.

టిటిడి ఎస్వీ పురాతన ఆలయాల పరిరక్షణ ట్రస్టు ద్వారా 100 సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన ఆలయాల మరమత్తులకు రూ.25 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎస్‌సి, ఎస్‌స్టీ, బిసి, మత్సకార కాలనీలలో నూతన ఆలయాలు నిర్మిస్తున్నట్లు వివరించారు. ఆయా కాలనీలలోని స్థానికులకు తిరుపతిలోని శ్వేతా భవనంలో అర్చక శిక్షణ ఇచ్చి, వారిని ఆయా ఆలయాలలో అర్చకులుగా నియమిస్తున్నట్లు తెలియచేశారు. ఎస్‌సి, ఎస్‌స్టీ, మత్సకార కాలనీలోని నూతన ఆలయాలకు రాతి విగ్రహలు, పంచలోహ విగ్రహలు, మైక్‌సెట్లు ఉచితంగా అందిస్తున్నట్లు, ఇతరులకు సబ్సిడిపై అందిస్తున్నట్లు గౌ|| మంత్రివర్యులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఎఫ్‌ఎ అండ్‌ సిఎవో శ్రీ బాలాజీ, సిఇ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, సిఏవో రవిప్రసాదు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.