JEO REVIEWS DEVELOPMENTAL WORKS IN TIRUMALA_ తిరుమలలో ఇంజినీరింగ్‌ పనుల పురోగతిపై జెఈవో సమీక్ష

Tirumala, 10 April 2018: Tirumala JEO Sri KS Sreenivasa Raju on Tuesday reviewed on various ongoing construction works with respect to Tirumala in SPRH Tirupati.

Directing the engineering officials, the JEO said, the third phase ring road works, F-type quarters renovation works and Dharmagiri BT road works should be completed within the stipulated time frame.

In view of the ensuing summer rush in Tirumala, additional toilets need to be constructed, he instructed the concerned.

CE Sri Chandra Sekhar Reddy, FACAO Sri Balaji, SEs Sri Ramachandra Reddy, Sri Venkateswarulu were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమలలో ఇంజినీరింగ్‌ పనుల పురోగతిపై జెఈవో సమీక్ష

ఏప్రిల్‌ 10, తిరుమల 2018: తిరుమలలో జరుగుతున్న ఇంజినీరింగ్‌ పనుల పురోగతిపై జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మంగళవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుమలలోని రింగ్‌ రోడ్డు నుండి బాలాజినగర్‌ వరకు జరుగుతున్న రోడ్డు పనులు, మూడో దశ రింగ్‌ రోడ్డు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎఫ్‌ టైప్‌ క్వార్టర్స్‌ మరమ్మతులు పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ధర్మగిరి మార్గంలో బిటి రోడ్డు ఏర్పాటుచేయాలని, కుమారధార పసుపుధార రోడ్డు పనులు చేపట్టాలని, కాకులకొండకు తారు రోడ్డు వేయాలని సూచించారు. పద్మావతి ఏరియాతో పాటు అవసరమైన చోట్ల బిటి రోడ్లు ఏర్పాటు చేయాలన్నారు. నిర్మాణంలో ఉన్న శ్రీవారి సేవాసదన్‌కు వేడినీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.

రద్దీ పెరుగుతున్న దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం తిరుమలలో ఉన్న మరుగుదొడ్ల సంఖ్యను రెట్టింపు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని జెఈవో సూచించారు. మరుగుదొడ్ల నిర్వహణ కోసం అత్యుత్తమ వ్యవస్థను ఏర్పాటుచేయాలని కోరారు. నారాయణగిరి ఉద్యానవనాల్లో భక్తులు వేచి ఉండేందుకు తాత్కాలిక షెడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఉగ్రాణం నుంచి మహద్వారం వరకు ఉన్న తూములకు అడ్డంగా ఇనుప జల్లెడలు ఏర్పాటు చేయాలన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అవసరమైన చోట్ల మరుగుదొడ్ల మరమ్మతులు చేపట్టాలన్నారు. టిటిడి అటవీ విభాగం ఆధ్వర్యంలో కాలినడక మార్గాలు, శిలాతోరణం, ఇతర ఉద్యానవనాలు వద్ద జరుగుతున్న మొక్కల పెంపకానికి డ్రిప్‌ స్ప్రింక్లర్లు ఏర్పాటుచేయాలని సూచించారు.

ఈ సమావేశంలో టిటిడి ఎఫ్‌ఏ, సిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ వేంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.