E-HUNDI FACILITY AT SRI PAT _ తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యానికి ఇ-హుండీ సౌక‌ర్యం

Tiruchanoor, 30 Jul. 20: On the lines of Tirumala Srivari temple, to promote e-Hundi facility for devotees of Sri Padmavati Ammavari temple at TTD has introduced e-Hundi facility.

The devotees now shall make their contributions in online directly either through the TTD website of www.tirupatibalaji.ap.gov.in or on Govinda mobile App.

The online facility is open for both the devotees who have already registered on the website and mobile app and also those who are yet to register. 

All devotees can make contributions with either debit/credit cards after submitting basic details like name, email-ID, mobile number and address.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యానికి ఇ-హుండీ సౌక‌ర్యం

తిరుప‌తి‌, 2020 జూలై 30: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం త‌ర‌హాలో తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యానికి ఇ-హుండీ సౌక‌ర్యాన్ని టిటిడి అందుబాటులోకి తీసుకొచ్చింది. నేరుగా ద‌ర్శ‌నానికి రాలేని భ‌క్తులు ఇ-హుండీ ద్వారా ఆన్‌లైన్‌లో అమ్మ‌వారికి కానుకలు స‌మ‌ర్పించ‌వ‌చ్చు.

www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారాగానీ, గోవింద మొబైల్ యాప్ ద్వారా గానీ భ‌క్తులు కానుక‌లు చెల్లించ‌వ‌చ్చు. వెబ్‌సైట్‌, యాప్‌లో ఇదివ‌ర‌కే న‌మోదు చేసుకున్న భ‌క్తుల‌తో పాటు ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదు చేసుకోనివారు కూడా ఈ సౌక‌ర్యాన్ని వినియోగించుకోవ‌చ్చు. పేరు, ఇ-మెయిల్‌, మొబైల్ నంబరు, చిరునామా త‌దిత‌ర వివ‌రాలు పొందుప‌రిచి డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు‌తో కానుక‌ల‌ను స‌మ‌ర్పించవ‌చ్చు.‌

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.