EFFECTIVE SECURIRTY AT TIRUMALA WITH LATEST TECHNOLOGY _ ఆధునిక టెక్నాలజితో తిరుమలలో పటిష్టమైన భద్రత

* MOCK DRILL BY OCTOPUS & POLICE AT TIRUMALA

 

Tirumala,5, July 2023: Octopus additional SP Sri Nagesh Babu said on Wednesday that TTD had reinforced its security infrastructure at Tirumala with latest technology and ever ready to face any security challenges.

 

Earlier he participated in a coordination meeting at the PAC-4 conference hall with Tirumala additional SP Sri Muni

 

Ramaiah, Octopus,Police,.fire services, Revenue, Medical and Engineering officials.

Speaking on the occasion he said the frequent mock drills in Tirumala are aimed at correcting the lapses in security and vigilance systems.

 

The objective is to showcase protection to devotees during attacks, if any by anti-social and terrorist organisations.

 

Sri Narasimha Rao, Octopus DSP made a PPP on how to tackle the challenge of an attack in Tirumala.

 

There will be a mock drill at Sri Padmavati rest house between 8.00-11.00 pm in coordination with Octopus, police, and TTD vigilance security wings on Wednesday in Tirumala.

 

Tirumala DSP Sri Bhaskar Reddy,TTD VGO Sri Giridhar,Fire Officer Sri Subramanya Reddy,AVSOs Sri Satish, Sri Sai Giridhar and all department officials of TTD were present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆధునిక టెక్నాలజితో తిరుమలలో పటిష్టమైన భద్రత
 
–  ఆక్టోపస్ పోలీసు దళం మాక్ డ్రిల్
 
తిరుమల, 2023 జూలై 05: ఆధునిక టెక్నాలజితో తిరుమలలో పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నట్లు, ఎలాంటి భద్రతాపరమైన సమస్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆక్టోపస్ అదనపు ఎస్పీ శ్రీ నగేష్ బాబు తెలిపారు. బుధవారం పిఎసి- 4లోని సమావేశ మందిరంలో తిరుమల అదనపు ఎస్పీ శ్రీ ముని రామయ్యతో కలిసి ఆయన ఆక్టోపస్, పోలీస్, ఫైర్, రెవెన్యూ, వైద్య, ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమలలో  తరచుగా ఇటువంటి మాక్ డ్రిల్స్ నిర్వహించడం ద్వారా భద్రత లోపాలను అధిగమించవచ్చన్నారు.
 
సంఘ విద్రోహులు తిరుమలలోని ఏదైనా ప్రదేశంపై దాడి చేసినప్పుడు  ఎలా తిప్పికొట్టి భక్తులకు రక్షణ కల్పించాలి అనేది ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ విధంగా తిరుమలలోని ఒక  విశ్రాంతి గృహంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. 
 
ఆక్టోపస్ డిఎస్పి శ్రీ నరసింహారావు సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొనేటప్పుడు ఏ విభాగం ఏ కార్యక్రమాలు నిర్వహించాలని విషయమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
 
బుధవారం రాత్రి 8  నుండి 11 గంటల వరకు తిరుమలలోని పద్మావతి  విశ్రాంతి గృహం వద్ద ఆక్టోపస్ పోలీసు దళం, నిఘా మరియు భద్రత విభాగం, పోలీసు, సంబంధిత శాఖల సమన్వయంతో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.
 
ఈ సమావేశంలో తిరుమల డిఎస్పి శ్రీ భాస్కర్ రెడ్డి, టీటీడీ విజీఓ శ్రీ గిరిధర్, ఫైర్ ఆఫీసర్ శ్రీ సుబ్రహ్మణ్యం రెడ్డి, ఏవీఎస్ఓలు శ్రీ సతీష్, శ్రీ గిరిధర్, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.