TTD TO RESTORE THE DILAPIDAATED PARUVETA MANDAPAM IN TIRUMALA _ శిథిలావస్థకు చేరుకున్న పార్వేట మండపాన్ని పునరుద్ధరిస్తున్నాం

MISGUIDED MALICIOUS CAMPAIGN ON ITS DEMOLITION BY SOME VESTED INTERESTS

 

Tirumala, 05 July 2023: It is proposed to rejuvenate the dilapidated Paruveta Mandapam located en route to Papa Vinashanam Dam in Tirumala.

 

In a statement released on Wednesday evening, TTD said the Mandapam does not belong to the Archeological Survey of India. It is a recreation spot of Sri Malayappa Swamy during the annual Parveta utsavam and Karthika Vana Bhojanam festivals with huge footfalls of devotees.

 

In view of its crumbling and damaged conditions, the Mandapam posed a threat of injuries to devotees and the TTD Board in its resolution no.113 dated July 11 in 2022 has already sanctioned 2.70 crores for its Jeernodharana (restoration). As tender procedures were completed the contractor has commenced works on Tuesday on July 4 this year.

 

In the backdrop of these developments, some vested interests have launched a malicious campaign against stating that TTD has planned to demolish the historical structure.

 

TTD warned of legal action against perpetrators for spreading such a wrong, mischievous and motivated campaign against TTD, playing with the sentiments of millions of devotees and damaging the reputation of the towering Hindu religious institution of the country.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

శిథిలావస్థకు చేరుకున్న పార్వేట మండపాన్ని పునరుద్ధరిస్తున్నాం

– అవగాహన లేక కొంతమంది మండపాన్ని కూల్చివేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు

తిరుమల, 2023 జూలై 05: తిరుమల పాపవినాశనం మార్గంలోని పార్వేట మండపం జీర్ణావస్థకు చేరుకోవడంతో ఆ మండపాన్ని పునరుద్ధరిస్తున్నాం. ఈ మండపం పురావస్తు శాఖకు చెందినది కాదు. ప్రతిఏటా పార్వేట ఉత్సవం, కార్తీక వనభోజనాల సమయంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఈ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ సమయంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. మండపం కూలిపోయే స్థితికి చేరుకోవడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే భక్తులు ఇబ్బందిపడాల్సి వస్తుంది. ఈ ప్రమాదాన్ని ముందే గుర్తించి టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానం సంఖ్య.113, 2022, జూలై 11వ తేదీన మండపం జీర్ణోద్ధరణ కోసం రూ.2.07కోట్లు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో సదరు కాంట్రాక్టరు జూలై 4, 2023 నుండి జీర్ణోద్ధరణ పనులు ప్రారంభించారు.

వాస్తవాలు ఇలా ఉండగా కొందరు వ్యక్తులు పనిగట్టుకుని టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్నారు. భక్తులు ఇలాంటి అవాస్తవ ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి. పవిత్రమైన ఈ కార్యక్రమంపై దుష్ప్రచారం చేస్తూ భక్తుల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.