EIGHTH EDITION BALAKANDA AKHANDA PARAYANAM HELD _ శ్రవణానందం బాలకాండ అఖండ పారాయ‌ణం

Tirumala, 21 April 2022:The 8th edition of Balakanda Akhanda Parayanam was grandly performed on Thursday with the avowed goal of health to global humanity at the Nada Neerajanam platform in Tirumala.

As part of parayanam, the 134 shlokas from chapters 33-37 were recited by Vedic pundits.

Speaking on the occasion acharya Ramakrishna Somayajulu of SV Vedic university said parayanams of Balakanda had a healing touch for all ailments and particularly the Visuchika nivarana mantra had a telling effect on all devotees who followed the SVBC live telecasts.

Among others who participated in the parayanam were Sri Ramanujacharya, Sri Maruti, acharyas of Dharmagiri Veda Pathashala, SV Vedic University, SV Higher Vedic Studies, and those from National Sanskrit University.

Thyagaraja sankeetans recital B Smt Balaram team from Nellore remained a major attraction.

TTD officials, pundits, and a large number of devotees were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రవణానందం బాలకాండ అఖండ పారాయ‌ణం

తిరుమల, 2022 ఏప్రిల్ 21;   ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై గురువారం ఉద‌యం 7 నుండి 9 గంటల వరకు 8వ విడ‌త బాల‌కాండ అఖండ పారాయ‌ణం శ్రవణానందంగా సాగింది.

 ఇందులో 33 నుండి 37 సర్గల వ‌ర‌కు గ‌ల 134 శ్లోకాలను పారాయణం చేశారు. వేద పండితుల అఖండ పారాయ‌ణం చేయ‌గా ప‌లువురు భ‌క్తులు భ‌క్తిభావంతో వారిని అనుస‌రించి శ్లోక పారాయ‌ణం చేశారు.

 ఈ సంద‌ర్భంగా ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఆచార్యులు ఆచార్య రామ‌కృష్ణ సోమ‌యాజులు మాట్లాడుతూ రామనామం పలికితే బాధ‌లు తొల‌గి, సుఖ సంతోషాలు కలుగుతాయన్నారు. బాల‌కాండలోని శ్లోకాలను, విషూచికా మ‌హ‌మ్మారి నివార‌ణ మంత్రమును ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో కోట్లాది మంది ప్ర‌జ‌లు ఒకేసారి పారాయ‌ణం చేస్తే ఫ‌లితం అనంతంగా ఉంటుంద‌ని వివ‌రించారు.

శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మారుతి శ్లోక పారాయ‌ణం చేశారు. అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేద అధ్యాయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యానికి చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నా‌రు.

ఈ సందర్భంగా నెల్లూరుకు చెందిన శ్రీమతి బాలార్క బృందం త్యాగరాజ కీర్తన “ముచ్చట బ్రహ్మాదులకు…”, ముత్తుస్వామి దీక్షితులు రచించిన “స్వామినాథ పరిపాలయ…” కీర్తనలను ఆలపించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అధికారులు, పండితులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.


టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.