ELECTRIC TWO WHEELERS DONATED _ టిటిడికి 25 టివిఎస్‌ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల విరాళం

TIRUMALA, 22 JULY 2022: TVS Motors Company has donated Rs. 30lakhs worth 25 electric two-wheelers to TTD on Friday.

After performing Puja, the Company representatives handed over the keys to TTD EO Sri AV Dharma Reddy.

TVS Vice President Sri Selvam, TVS Future Mobility Vice President Sri Manoj Saxena, Tirupati Dealer Sri PR Siddhartha, representative Sri Raja Reddy, DI Tirumala Sri Janakirami Reddy were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUMALA

 

టిటిడికి 25 టివిఎస్‌ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల విరాళం

తిరుమల, 2022 జూన్ 22: టిటిడికి శుక్ర‌వారం రూ.30 ల‌క్ష‌ల విలువైన 25 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను టివిఎస్ మోటార్స్ సంస్థ విరాళంగా అందించింది.

ఈ మేర‌కు టివిఎస్ సంస్థ ప్ర‌తినిధులు శ్రీ‌వారి ఆల‌యం ఎదుట ఈ ద్విచ‌క్ర వాహ‌నాల‌కు పూజా కార్య‌క్ర‌మం నిర్వ‌హించి వాటి తాళాల‌ను టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు. తిరుమ‌ల ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు ఉప‌యోగ‌ప‌డే విధంగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాలను అందించిన టివిఎస్ సంస్థ‌కు ఈ సంద‌ర్భంగా ఈవో ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.
     
ఈ కార్య‌క్ర‌మంలో టివిఎస్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సెల్వం, టివిఎస్ (ఫ్యూచ‌ర్ మొబిలిటి) వైస్ ప్రెసిడెంట్ శ్రీ మ‌నోజ్ స‌క్సేనా, తిరుప‌తిలోని శ్రీ‌నివాస టివిఎస్ డీల‌ర్ శ్రీ పిఆర్‌.సిద్ధార్థ్, ప్ర‌తినిధి శ్రీ రాజారెడ్డి, డ్రైవింగ్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌ శ్రీ జానకిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.