ELECTRICAL GRANDEUR IN TIRICHANOOR_ విద్యుత్ వెలుగుల్లో ఉట్టిప‌డుతున్న బ్ర‌హ్మోత్స‌వ శోభ‌

Tiruchanoor, 10 Dec. 18: TTD has laid out grand and glittering electrical boarding, arches and showcase of Puranic episodes to herald the grandeur of Sri Padmavati Ammavari annual Karthika Brahmotsavams.

The electrical arches and hoardings designed with LED bulbs were put up for the mega event from Sri Padmavati temple, vahana mandapam, Asthana Mandapam, Mada streets, Ramanuja circle(at Tirupati), enthralling devotees all throughout the night.

The 40 different electrical displays in all included Dashavataram, Ashta Lakshmi, Standing Goddess Padmavati, Sri Mahavishnu, Sri Lakshmi Devi, Sun God, Lord Venkateswara-Sri Padmavati, Nijapada darshanam, Krishna, Lakshmana, Anjaneya, Vinayaka, and other Goddesses, besides Elephants, Garuda, and Horses.

The TTD has also made fusion lighting on the Mada streets to highlight the glitter of ornaments and decorations

Attractive Gow-Mata cutout

A huge cutout of Gow-Mata ( holy cow) near the temple adjacent to Panchayat office, is a major attraction of the festivities.The 70×55 feet cut-out is decked up in bright colors and LED bulbs.

The cut out also comprises frames of 30 Gods and Goddesses besides the Cow and calf. Another 30×60 Cut out of God Surya is on the West mada street and a 20×38 feet Sri Lakshmi cut out in the North Mada street outshine the skies. The Gitopadesam cut out with LED bulbs near the Tiruchanoor private bus stand is also a star attraction.

Under the supervision of TTD chief engineer Sri Chandrasekhar Reddy and Electrical SE, Sri Venkateswarlu, DEs Sri Chandrasekhar, 100 workers and experts from Hyderabad made all the arrangements with LED bulbs to reduce the burden of the power supply during Brahmotsavams.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ప్రత్యేకం

విద్యుత్ వెలుగుల్లో ఉట్టిప‌డుతున్న బ్ర‌హ్మోత్స‌వ శోభ‌

తిరుపతి, 2018 డిసెంబరు 09: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విద్యుత్‌ దీపాల అలంకరణలు మరింత శోభను చేకూరుస్తున్నాయి. అమ్మవారి ఆలయం, వాహనమండపం, ఆస్థానమండపం, మాడ వీధులు, తిరుపతిలోని రామానుజ సర్కిల్‌ నుంచి తిరుచానూరు ఆలయం వరకు రోడ్డు పొడవునా ఆకట్టుకునేలా విద్యుత్‌ అలంకరణలు చేపట్టారు. రాత్రి వేళ ఈ మార్గంలో వెళుతున్న భక్తులకు ఉత్సవ శోభ ఉట్టిపడుతోంది.

దశావతారాలు, అష్టలక్ష్ములు, వినాయకుడు, శ్రీ సీతారామ‌ల‌క్ష్మ‌ణ‌, రాముడు, శ్రీ సీతారాముడు, శ్రీ అనంత‌ప‌ద్మనాభ‌స్వామి, శ్రీపద్మావతి అమ్మవారు, మ‌త్స్యావ‌తారం, గోపాల‌కృష్ణుడు, అభిషేక‌ల‌క్ష్మి, ఆంజ‌నేయ‌స్వామి, గ‌జ‌ల‌క్ష్మి, స్వామివారి శిర‌స్సు, శ్రీ‌నివాస‌క‌ల్యాణం, ల‌క్ష్మీ, మ‌హావిష్ణు, రాధాకృష్ణ, క‌ల‌శ‌ల‌క్ష్మి, శ్రీ ప‌ద్మావ‌తి వేంక‌టేశ్వ‌రులు, తదితర కలిపి 40 విద్యుత్‌ కటౌట్లను ఏర్పాటుచేశారు. రాత్రివేళ వాహనసేవలో అమ్మవారితోపాటు ఆభరణాలు, అలంకారం భక్తులకు స్పష్టంగా కనిపించేలా హాలోజన్‌ సిట్టింగ్‌ లైట్లు ఏర్పాటుచేశారు.

ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా భారీ కటౌట్లు…

ప‌ద్మ‌పుష్క‌రిణి వ‌ద్ద 40 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తులో శ్రీ సూర్య‌నారాయ‌ణ‌స్వామి, 35 అడుగుల వెడల్పు, 50 అడుగుల ఎత్తుతో విశ్వ‌రూపం, ఎస్‌బిఐ ఎటిఎం వ‌ద్ద 40 అడుగుల వెడ‌ల్పు, 50 అడుగుల ఎత్తులో క‌ల‌శ‌ల‌క్ష్మి, తిరుచానూరు ఫ్లైవోవ‌ర్ వద్ద 50 అడుగుల వెడ‌ల్పు, 50 అడుగుల ఎత్తులో శ్రీ ప‌ద్మావ‌తి వేంక‌టేశ్వ‌రులు, పూడి జంక్ష‌న్ వ‌ద్ద వ‌ద్ద 40 అడుగుల వెడ‌ల్పు, 50 అడుగుల ఎత్తులో మ‌హాల‌క్ష్మి భారీ విద్యుత్ క‌టౌట్లు భ‌క్తుల‌కు విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి.

నూతనంగా మ‌ల్టీఫ్రేమ్ క‌టౌట్లు…

ఈ బ్రహ్మోత్సవాల్లో నూతనంగా మ‌ల్టీఫ్రేమ్ క‌టౌట్లు ఏర్పాటుచేశారు. ఇందులో ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి, క‌ల‌శ‌ల‌క్ష్మి, కృష్ణుడు – మ‌హావిష్ణువు, గోపుర‌ల‌క్ష్మీ దేవ‌తామూర్తుల‌ను రూపొందించారు. ప‌లుచోట్ల విద్యుత్ పందిరిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా, వాహ‌న మండ‌పం, అమ్మ‌వారి ఆల‌యం, ఆస్థాన మండపంలో ఆక‌ట్టుకునేలా విద్యుత్ అలంక‌ర‌ణ‌లు చేప‌ట్టారు.

రామానుజ స‌ర్కిల్ నుండి మొద‌లు…

తిరుపతిలోని రామానుజ సర్కిల్‌ నుంచి తిరుచానూరు ఫైఓవర్‌, అమ్మవారి ఆలయం వరకు విద్యుత్‌ తోరణాలతోపాటు అక్కడక్కడ ఉన్న చెట్లను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. శిల్పకళారామం నుంచి అమ్మవారి ఆలయం వరకు సప్తద్వారాలను రూపొందించారు. హైద‌రాబాద్ నిపుణుల స‌హ‌కారంతో మొత్తం 100 మంది సిబ్బంది ఈ విద్యుత్‌ అలంకరణలు చేప‌ట్టారు. విద్యుత్‌ వాడకాన్ని తగ్గించేందుకు పూర్తిగా ఎల్‌ఇడి విద్యుత్‌ దీపాలను ఏర్పాటుచేశారు. టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ వెంకటేశ్వర్లు, డిఇ శ్రీ చంద్ర‌శేఖ‌ర్ ఈ విద్యుత్‌ అలంక‌ర‌ణ‌ల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.